Self-Delusion గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అలాంటి వ్యక్తులు ఈ ప్రమాణం యొక్క మాటలు విన్నప్పుడు, వారు తమ మీదికి ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటూ, “నేను నా సొంత మార్గంలో వెళ్లాలని పట్టుదలతో ఉన్నప్పటికీ, నేను సమాధానం కలిగి ఉంటాను” అని అనుకుంటారు, వారు నీటితో తడపబడిన భూమిపైకి, అలాగే ఎండిన భూమిపైకి విపత్తును తెస్తారు.
ఇశ్రాయేలీయులు కూడా తమ సైన్యాన్ని పోగుచేసుకుని సామాగ్రి పొందుకున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు రెండు చిన్న మేకల మందలా వారికి ఎదురుగా బస చేశారు, మరోవైపు అరామీయులు గ్రామీణ ప్రాంతాల్లో నిండి ఉన్నారు.
అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు. అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.
“ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు.
“దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.
నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను.
వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా, వారు అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వారిని పొగిడినా,
“కాని నా ప్రజలు నా మాట వినలేదు; ఇశ్రాయేలు నాకు లోబడలేదు.
కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు! నేను వారి మొండి హృదయాలకు వారిని అప్పగించాను.
ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;
నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.
“నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను.
ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.
నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ అని నీకు నీవు అనుకున్నప్పుడు నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి.
విపత్తు నీ మీదికి వస్తుంది, దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. ఒక కీడు నీ మీద పడుతుంది దానిని నీవు డబ్బుతో నివారించలేవు; నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది.
వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.
వారు యెహోవా గురించి అబద్ధం చెప్పారు; వారు, “ఆయన ఏమీ చేయడు! మాకు ఎలాంటి హాని జరగదు; మేము ఖడ్గం గాని కరువు గాని ఎన్నడూ చూడము.
ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు.
ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; అతన్ని అలాగే వదిలేయండి!
“నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.
‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడని మీతో చెప్తున్నాను.
“ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు.
ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు.
అప్పుడు నేను వారితో, ‘మీరెవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని చెప్తాను.