Skip to content

Self-Crimination గురించి బైబిల్ వచనాలు

27 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  2. “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ‘ఒకవేళ ఒక వ్యక్తి భార్య దారితప్పి అతనికి నమ్మకద్రోహం చేసి,

  3. మరొక వ్యక్తి ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఆ విషయం తన భర్తకు తెలియకుండ దాచబడి ఆమె అపవిత్రపరచబడింది అనడానికి సాక్ష్యం లేకపోయినా, ఆమె పట్టుబడకపోయినా,

  4. ఒకవేళ అతడు తన భార్య మీద అసూయపడి ఆమెను అనుమానించినప్పుడు, ఆమె నిజంగానే అపవిత్రమైతే, ఒకవేళ ఆమె అపవిత్రం కాకపోయినా అతడు ఆమెను అనుమానిస్తే,

  5. అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ.

  6. “ ‘యాజకుడు ఆమెను తీసుకువచ్చి యెహోవా ఎదుట నిలబెట్టాలి.

  7. తర్వాత యాజకుడు ఓ మట్టి కూజలో పవిత్ర జలం తీసుకుని సమావేశ గుడారంలోని నేల మట్టిని ఆ నీటిలో వేయాలి.

  8. యాజకుడు యెహోవా ఎదుట ఆమెను నిలబెట్టిన తర్వాత, ఆమె జుట్టును విప్పి, శాపాన్ని తెచ్చే చేదు నీటిని యాజకుడు పట్టుకుని, జ్ఞాపక అర్పణను అంటే అనుమానం కొరకైన జ్ఞాపక అర్పణను ఆమె చేతుల్లో పెట్టాలి.

  9. తర్వాత యాజకుడు ఆ స్త్రీతో ప్రమాణం చేయించి, “ఏ మనుష్యుడు నీతో లైంగిక సంబంధం లేకపోతే, నీ భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పకుండ, అపవిత్రం కాకుండ ఉంటే, శాపం తెచ్చే ఈ చేదు నీళ్ల నుండి నీవు నిర్దోషివి అవుతావు.

  10. అయితే నీ భర్తతో పెళ్ళి చేసుకున్న తర్వాత నీవు త్రోవ తప్పి, నీ భర్త కాకుండా వేరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుని ఉంటే,”

  11. యాజకుడు ఆమె మీదికి, “యెహోవా నిన్ను నీ ప్రజలమధ్య ఒక శాపంగా చేసి, నీ గర్భం పోవునట్లు, నీ ఉదరం ఉబ్బిపోయేలా చేయును గాక.

  12. శాపం తెచ్చే ఈ నీరు నీ శరీరంలోనికి ప్రవేశించి నీ ఉదరం ఉబ్బిపోయేలా లేదా నీ గర్భం పోవునట్లు చేయును గాక” అని శాపం పలుకుతాడు. “ ‘అప్పుడు ఆ స్త్రీ, “ఆమేన్, అలాగే జరుగును గాక” అని అనాలి.

  13. “ ‘యాజకుడు ఈ శాపాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి దానిని చేదు నీటితో కడగాలి.

  14. శాపం తెచ్చే ఆ చేదు నీటిని ఆమెతో త్రాగించాలి, అప్పుడు శాపం తెచ్చే ఆ నీరు ఆమెలో చేదు పుట్టిస్తుంది.

  15. యాజకుడు ఆమె చేతి నుండి అసూయ కొరకైన భోజనార్పణను తీసుకుని, యెహోవా ఎదుట పైకెత్తి దానిని బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి.

  16. యాజకుడు ఆ భోజనార్పణలో నుండి పిడికెడు తీసుకుని దాన్ని బలిపీఠం మీద జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి; తర్వాత అతడు ఆ స్త్రీతో ఆ నీరు త్రాగించాలి.

  17. ఆమె తనను తాను అపవిత్రపరచుకుని ఉంటే, తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, ఫలితం ఇలా ఉంటుంది: శాపం తెచ్చే ఆ నీళ్లను ఆమె త్రాగినప్పుడు, ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె కడుపు ఉబ్బుతుంది, ఆమె గర్భం పోతుంది ఆమె శాపంగా మారుతుంది.

  18. అప్పుడు యెహోషువ ఆకానుతో, “నా కుమారుడా, నిజం చెప్పి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ కలిగేలా ఆయనను ఘనపరచు. నువ్వేం చేశావో నాతో చెప్పు; దాన్ని నా దగ్గర దాచవద్దు అన్నాడు” అన్నాడు.

  19. అందుకు ఆకాను యెహోషువతో, “అది నిజమే! ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నేను పాపం చేశాను. నేను ఏం చేశానంటే,

  20. దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను వస్త్రం, రెండువందల షెకెళ్ళ వెండి, యాభై షెకెళ్ళ బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు.

  21. కాబట్టి యెహోషువ దూతలను పంపినప్పుడు వారు గుడారానికి పరుగెత్తి, అతని గుడారంలో నేలలో క్రింద వెండి, దానిపై మిగతావి దాచిపెట్టబడి ఉండడం చూశారు.

  22. ఆ డేరా మధ్య నుండి వారు వాటిని తీసి యెహోషువ, ఇశ్రాయేలీయుల దగ్గరకు తెచ్చి యెహోవా ఎదుట వాటిని ఉంచారు.

  23. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులతో పాటు జెరహు వంశస్థుడైన ఆకానును వెండిని వస్త్రాన్ని బంగారుకడ్డీని ఆకాను కుమారులను కుమార్తెలను అతని ఎద్దులను గాడిదలను గొర్రెలను అతని డేరాను అతనికి ఉన్నదంతటిని పట్టుకుని ఆకోరు లోయకు తెచ్చారు.

  24. యెహోషువ, “నీవు మాకు ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తారు” అని అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా ఆకానును, అతని కుటుంబీకులను రాళ్లతో కొట్టి కాల్చివేశారు.

  25. “ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు,