Skip to content

Reward గురించి బైబిల్ వచనాలు

166 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేనే మీ పట్ల శత్రువుగా ఉంటాను, మీ పాపాలకు ఇంకా ఏడు రెట్లు బాధిస్తాను.

  2. నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.

  3. నేను మీ రొట్టె సరఫరాను నిలిపివేసినప్పుడు, పదిమంది స్త్రీలు మీ రొట్టెను ఒక పొయ్యిలో కాల్చగలుగుతారు, వారు తూనికె చొప్పున రొట్టెను కొలిచి ఇస్తారు. మీరు తింటారు, కానీ మీరు సంతృప్తి చెందరు.

  4. “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే,

  5. అప్పుడు నా కోపంలో నేను మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటాను, నేనే మిమ్మల్ని మీ పాపాల కోసం ఇంకా ఏడు రెట్లు శిక్షిస్తాను.

  6. మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.

  7. నేను మీ క్షేత్రాలను నిర్మూలం చేస్తాను, మీ ధూప బలిపీఠాలను పడగొట్టి, మీ మృతదేహాలను ప్రాణం లేని మీ విగ్రహాల రూపాలపై పోగుచేస్తాను, నేను మిమ్మల్ని అసహ్యించుకుంటాను.

  8. నేను మీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను, మీ పరిశుద్ధాలయాలను వృథా చేస్తాను, మీ అర్పణల సువాసన యందు నేను ఆనందించను.

  9. నేను భూమిని వృధా చేస్తాను, తద్వార అక్కడ నివసించే మీ శత్రువులు ఆశ్చర్యపడతారు.

  10. నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.

  11. మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు భూమి తన సబ్బాతు సంవత్సరాలను ఆనందిస్తుంది తద్వార ఎప్పటికీ అది నిర్జనమై ఉంటుంది; అప్పుడు భూమి విశ్రాంతి తీసుకుని దాని సబ్బాతు దినాలను ఆనందిస్తుంది.

  12. అన్ని సమయాల్లో అది నిర్జనమై ఉంటుంది, మీరు అందులో నివసించినప్పుడు సబ్బాతు దినాల్లో అది పొందని విశ్రాంతిని పొందుతుంది.

  13. “ ‘మీలో మిగిలిన వారికైతే, వారి శత్రువుల దేశాల్లో గాలికి ఆకులు అల్లాడితే పారిపోవునంతగా వారి హృదయాలు ఎంతో భయపడేలా చేస్తాను. ఖడ్గం నుండి వారు పారిపోతున్నట్టు వారు పరుగెత్తుతారు, ఎవరు తరమకుండానే వారు పడిపోతారు,

  14. ఎవరూ వారిని తరమనప్పట్టికి ఖడ్గం నుండి పారిపోతున్నట్లు వారు ఒకరిపై ఒకరు దొర్లుతారు. కాబట్టి మీరు మీ శత్రువుల ఎదుట నిలువలేరు.

  15. మీరు దేశాల మధ్య నశిస్తారు; మీ శత్రువుల భూమి మిమ్మల్ని మ్రింగివేస్తుంది.

  16. శత్రు దేశంలో మీలో మిగిలిన వారు తమ పాపాలను బట్టి కుళ్ళిపోతారు; తమ పూర్వికుల పాపాలను బట్టి కూడా కుళ్ళిపోతారు.

  17. “ ‘కాని వారు తమ పాపాలను, వారి పూర్వికుల పాపాలను ఒప్పుకుని అంటే వారు నాకు చేసిన ద్రోహం, తద్వార నేను వారికి విరుద్ధంగా నడిచి, వారిని శత్రువుల దేశానికి పంపానని ఒప్పుకుని, అంటే సున్నతిలేనివారి హృదయాలు తగ్గించుకొని వారి పాపాలకు వారు మూల్యం చెల్లిస్తే,

  18. And that I also have walked contrary unto them, and have brought them into the land of their enemies; if then their uncircumcised hearts be humbled, and they then accept of the punishment of their iniquity:

  19. నేను యాకోబుతో నా నిబంధనను, ఇస్సాకుతో నా నిబంధనను, అబ్రాహాముతో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.

  20. భూమి వారిచే విడిచిపెట్టబడుతుంది, నిర్జనమవుతుంది, వారు లేకుండా, నిర్జన స్థితిలో ఉండగా, అది సబ్బాతు దినాలను ఆనందిస్తుంది. వారు నా చట్టాలను తిరస్కరించారు, నా శాసనాలను అసహ్యించుకున్నారు కాబట్టి వారు వారి పాపాలకు మూల్యం చెల్లిస్తారు.

  21. అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.

  22. అయితే వారి కోసం నేను జనముల దృష్టిలో వారి దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను.’ ”

  23. మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.

  24. ఇశ్రాయేలూ విను, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు శ్రేయస్సు కలిగి అధికంగా అభివృద్ధి కలిగేలా మీరు వాటికి లోబడి ఉండేలా జాగ్రత్త వహించండి.

  25. మీకు మేలు కలిగేలా యెహోవా చెప్పినట్లు మీ శత్రువులందరిని మీ ఎదుట నుండి తరిమివేసి యెహోవా మీ పూర్వికులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి.