Pelethites గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు పెలేతీయులకు అధిపతి. దావీదు కుమారులు యాజకులు.
రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు.
కాబట్టి యోవాబు మనుష్యులు కెరేతీయులు పెలేతీయులు యుద్ధ వీరులందరు అబీషై నాయకత్వంలో యెరూషలేము నుండి బయలుదేరి బిక్రి కుమారుడైన షేబను వెంటాడటానికి వెళ్లారు.
యోవాబు ఇశ్రాయేలు సైన్యమంతటికి అధిపతి; కెరేతీయులకు పెలేతీయులకు యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి;
కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు.
యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి; దావీదు కుమారులు రాజు ప్రధాన అధికారులు.