Skip to content

Naboth గురించి బైబిల్ వచనాలు

35 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జరిగినదంతా యూదా రాజైన అహజ్యా చూసినప్పుడు, అతడు బేత్-హగ్గాన్ మార్గం గుండా పారిపోయాడు. యెహు అతని వెంటపడి, “అతన్ని కూడా చంపండి!” అని ఆజ్ఞాపించాడు. వారు గూరుకు పోయే త్రోవలో ఇబ్లెయాము దగ్గర అతన్ని తన రథంలో గాయపరిచారు, అయితే అతడు మెగిద్దోకు తప్పించుకుని వెళ్లి అక్కడ మృతిచెందాడు.

  2. అతని సేవకులు అతన్ని రథంలో యెరూషలేముకు తీసుకెళ్లి, దావీదు పట్టణంలో అతని పూర్వికుల దగ్గర అతన్ని సమాధి చేశారు.

  3. (అహాబు కుమారుడైన యోరాము పరిపాలన యొక్క పదకొండవ సంవత్సరంలో అహజ్యా యూదాకు రాజయ్యాడు.)

  4. తర్వాత యెహు యెజ్రెయేలుకు వెళ్లాడు. ఆ సంగతి యెజెబెలు విన్నప్పుడు, ఆమె తన కళ్లకు కాటుక పెట్టుకొని, తలను అలంకరించుకుని, కిటికీలో నుండి చూస్తూ ఉంది.

  5. యెహు ద్వారంలో ప్రవేశించగానే, యెజెబెలు అతనితో, “తన యజమానుని హత్యచేసిన జిమ్రీ లాంటివాడా, సమాధానంగా వస్తున్నావా?” అని అడిగింది.

  6. అతడు తన తల పైకెత్తి కిటికీవైపు చూసి, “నా పక్షంగా ఉన్నవారెవరు?” అని అరవగానే ఇద్దరు, ముగ్గురు నపుంసకులు క్రిందికి అతనివైపు చూశారు.

  7. అప్పుడు యెహు వారితో, “ఆమెను క్రిందికి త్రోసివేయండి” అని అరిచాడు. వెంటనే వారు ఆమెను త్రోసివేయగా ఆమె నేల మీద పడి, ఆమె రక్తం గోడపైన గుర్రాలపైన చిమ్మింది, యెహు తన రథాన్ని ఆమెపైకి ఎక్కించాడు.

  8. తర్వాత యెహు లోపలికి వెళ్లి భోజనం చేశాడు. అతడు వారికి, “ఈ శపితమైన స్త్రీ సంగతి చూడండి, ఈమె రాజకుమార్తె కాబట్టి ఈమె శవాన్ని పాతిపెట్టండి” అని ఆదేశించాడు.

  9. వెంటనే వారు ఆమెను పాతిపెట్టడానికి వెళ్లారు గాని ఆమె కపాలం, పాదాలు, అరచేతులు తప్ప ఏమీ కనిపించలేదు.

  10. వారు తిరిగివచ్చి యెహుకు విషయం చెప్పినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన సేవకుడైన తిష్బీయుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ఇది: యెజ్రెయేలులో ఈ నేల మీద యెజెబెలు శరీరాన్ని కుక్కలు తింటాయి.