Skip to content

Mountains గురించి బైబిల్ వచనాలు: Afforded pasturage

5 వచనాలు · 82 కోణాలు

Afforded pasturage గురించి వచనాలు

  1. ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు దగ్గరకు వచ్చాడు.

  2. “ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు.

  3. అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.

  4. ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; భూమికి వర్షమిచ్చి కొండలపై గడ్డి మొలిపిస్తారు.

  5. సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.