Skip to content

Magistrates గురించి బైబిల్ వచనాలు

22 వచనాలు · 33 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. కొంతకాలం తర్వాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకు వచ్చి అతని ముందు నిలబడ్డారు.

  2. వారిలో ఒక స్త్రీ అన్నది, “నా ప్రభువా, దయచేసి వినండి. ఈ స్త్రీ, నేను ఒకే ఇంట్లో ఉంటాము. ఈమె నాతో ఉన్నప్పుడు నేను శిశువును కన్నాను.

  3. నాకు శిశువు పుట్టిన మూడవ రోజు ఈమెకు కూడ శిశువు పుట్టాడు. మేము ఒంటరిగా ఉన్నాము; మేము తప్ప ఇంట్లో మరొకరు లేరు.

  4. “రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు.

  5. కాబట్టి మధ్యరాత్రి ఈమె లేచి, మీ దాసురాలైన నేను పడుకోని ఉన్నప్పుడు, నా ప్రక్కన ఉన్న నా కుమారుని తీసుకుని తన ప్రక్కన పెట్టుకొని, చనిపోయిన తన కుమారుని నా ప్రక్కన పెట్టింది.

  6. ప్రొద్దున నా కుమారునికి పాలు ఇవ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు! అయితే నేను ఉదయకాలపు వెలుగులో గమనించి చూస్తే, వాడు నేను జన్మనిచ్చిన వాడు కాదు.”

  7. ఇంకొక స్త్రీ అన్నది, “లేదు! బ్రతికి ఉన్నవాడు నా కుమారుడు; చనిపోయినవాడు నీ వాడు.” మొదటి స్త్రీ అన్నది, “లేదు! చనిపోయినవాడు నీ వాడు; బ్రతికి ఉన్నవాడు నావాడు.” ఇంకా రాజు ముందు వారు వాదించుకున్నారు.

  8. రాజు అన్నాడు, “ఈమె అంటుంది, ‘నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు చనిపోయాడు’ ఆమె అంటుంది, ‘లేదు! నీ కుమారుడు చనిపోయాడు, నావాడు బ్రతికి ఉన్నాడు.’ ”

  9. అప్పుడు రాజు అన్నాడు, “నాకొక ఖడ్గం తీసుకురండి.” కాబట్టి వారు ఖడ్గం రాజు దగ్గరకు తెచ్చారు.

  10. అప్పుడు రాజు వారికి ఇలా ఆదేశించాడు: “బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి, ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి.”

  11. అందుకు బ్రతికి ఉన్న శిశువు యొక్క తల్లి తన కుమారుని పట్ల జాలితో కరిగిపోయి రాజుతో అన్నది, “దయచేసి, నా ప్రభువా, ఆమెకు బ్రతికి ఉన్న శిశువును ఇచ్చేయండి! అతన్ని చంపకండి!” అయితే ఇంకొక స్త్రీ అన్నది, “అతడు నీకు గాని, నాకు గాని దక్కకూడదు. అతన్ని రెండు ముక్కలు చేయండి!”

  12. అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”

  13. రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.

  14. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు.

  15. అప్పుడు ఏలాము వారసులలో ఒకడైన యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో, “మా చుట్టూ ఉన్న ప్రజల నుండి పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహం చేశాము. అయినా ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకుంటారనే నిరీక్షణ ఉంది.

  16. నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి.

  17. లెండి; ఈ పని మీ చేతిలోనే ఉంది. మేము మీకు మద్ధతు ఇస్తాం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి” అన్నాడు.

  18. అప్పుడు ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులందరు ఆ మాట ప్రకారం చేసేలా వారితో ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేశారు.

  19. అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు.

  20. చెర నుండి విడుదలై వచ్చిన వారంతా యెరూషలేములో సమావేశం కావాలని యూదాలో, యెరూషలేములో ప్రకటన చేశారు.

  21. ఎవరైనా మూడు రోజుల లోపు అధికారులు, పెద్దల నిర్ణయం ప్రకారం రాకపోతే, వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. వారు చెర నుండి విడుదలై వచ్చిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారు.

  22. మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు.