కంటెంట్‌కు వెళ్లండి

Locust గురించి బైబిల్ వచనాలు: Devastation by

8 వచనాలు · 9 కోణాలు

"Locust" కోసం వెతకండి

Devastation by గురించి వచనాలు

  1. మిడతల గుంపు విడిచిపెట్టిన దానిని పెద్ద మిడతలు తినేశాయి; పెద్ద మిడతలు విడిచిపెట్టిన దానిని చిన్న మిడతలు తినేశాయి; చిన్న మిడతలు విడిచిపెట్టిన దానిని ఇతర మిడతలు తినేశాయి.

  2. త్రాగుబోతులారా, మేల్కొని ఏడవండి! ద్రాక్షరసం త్రాగే మీరందరు విలపించండి; క్రొత్త ద్రాక్షరసం కోసం విలపించండి, ఎందుకంటే అది మీ నోటి పెదవుల దగ్గర నుండి తీసివేయబడింది.

  3. లెక్కలేనంత గొప్ప సైన్యం ఉన్న ఒక దేశం, నా దేశాన్ని ఆక్రమించింది; దానికి సింహం పళ్లు ఉన్నాయి ఆడసింహం కోరలు ఉన్నాయి.

  4. అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసింది నా అంజూర చెట్లను నాశనం చేసింది. అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు, చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.

  5. ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటాల వంటివి ఉన్నాయి; వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి.

  6. వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి.

  7. వాటి ఛాతీ ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రాల రథాల ధ్వనిలా ఉంది.

  8. వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి అయిదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులకు హాని చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి.