Skip to content

Gibeonites గురించి బైబిల్ వచనాలు

34 వచనాలు · 14 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు; నేను వారిని నీ చేతికి అప్పగించాను. వారిలో ఒక్కరు మీ ముందు నిలబడలేరు” అని చెప్పారు.

  2. గిల్గాలు నుండి రాత్రంతా నడిచి వచ్చిన తర్వాత, యెహోషువ హఠాత్తుగా వారి మీద దాడి చేశాడు.

  3. యెహోవా వారిని ఇశ్రాయేలీయుల ముందు గందరగోళంలో పడేశారు, కాబట్టి ఇశ్రాయేలీయులు గిబియోనులో వారిని పూర్తిగా ఓడించారు. ఇశ్రాయేలీయులు బేత్-హోరోనుకు పైకి వెళ్లే దారిలో అజేకా, మక్కేదా వరకు వారిని వెంటాడి నరికివేశారు.

  4. అందుకు గిబియోనీయులు, “సౌలు అతని కుటుంబం నుండి వెండి బంగారాలను గాని ఇశ్రాయేలులో ఎవరినైనా చంపమని గాని అడగడం లేదు” అని అన్నారు. దావీదు, “నేనేం చేయాలో చెప్పండి అది మీకు చేస్తాను” అన్నాడు.

  5. అప్పుడు వారు రాజుతో, “మాకు శత్రువుగా మారి మేము నాశనం అవ్వాలని ఇశ్రాయేలు సరిహద్దులలో లేకుండా నిర్మూలం చేయాలని కుట్రపన్నిన సౌలు సంతతివారిలో ఏడుగురు మగవారిని మాకు అప్పగించండి.

  6. యెహోవా ఏర్పరచుకున్న సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సమక్షంలో వారిని ఉరితీస్తాం” అన్నారు. అందుకు రాజు, “సరే, నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు.

  7. దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.

  8. అయితే రాజు సౌలుకు అయ్యా కుమార్తె రిస్పాకు పుట్టిన ఇద్దరు కుమారులైన అర్మోని మెఫీబోషెతులను, సౌలు కుమార్తె మెరాబుకు మెహోలతీయుడైన బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలుకు పుట్టిన అయిదుగురు కుమారులను తీసుకువచ్చాడు.

  9. వారిని గిబియోనీయులకు అప్పగించాడు. వారు ఈ ఏడుగురిని యెహోవా ఎదుట కొండమీద ఉరితీసి చంపారు. ఆ ఏడుగురు ఒకేసారి చనిపోయారు. కోతకాలం మొదటి రోజున యవల కోత మొదలు పెడుతున్నప్పుడు వారిని చంపారు.