కంటెంట్‌కు వెళ్లండి

Gibeonites గురించి బైబిల్ వచనాలు: Appointed, hewers of wood, &c

8 వచనాలు · 14 కోణాలు

Appointed, hewers of wood, &c గురించి వచనాలు

  1. మనం వారికి చేసిన ప్రమాణం వల్ల మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండేలా వారిని బ్రతుకనిద్దాం” అన్నారు.

  2. వారు ఇంకా మాట్లాడుతూ, “వారిని బ్రతుకనివ్వండి, వారు సమాజమంతటికి కట్టెలు కొట్టేవారిగా నీళ్లు తెచ్చేవారిగా ఉంటారు” అని జవాబిచ్చారు. అలా నాయకులు ఇచ్చిన మాట నెరవేరింది.

  3. యెహోషువ గిబియోనీయులను పిలిపించి వారితో, “మీరు మా దగ్గరే నివసించే వారైనప్పటికి మేము చాలా దూరంలో ఉంటామని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?

  4. అందుకే మీరు శాపానికి గురైయ్యారు. మీరు ఎప్పటికీ నా దేవుని మందిరానికి కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చే వారిగానే ఉంటారు” అని చెప్పాడు.

  5. అందుకు వారు యెహోషువకు, “మీ దేవుడైన యెహోవా ఈ దేశమంతటిని మీకు ఇవ్వమని, దాని నివాసులందరిని మీ ముందు నుండి తుడిచిపెట్టమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించారని మీ దాసులమైన మాకు స్పష్టంగా తెలిసింది. మీ వల్ల మాకు ప్రాణభయం ఉంది, అందుకే ఇలా చేశాము.

  6. మేమిప్పుడు మీ చేతుల్లో ఉన్నాము. మా విషయంలో మీకు ఏది మంచిది, ఏది సరియైనది అనిపిస్తే అదే చేయండి” అని జవాబిచ్చారు.

  7. కాబట్టి యెహోషువ గిబియోనీయులను ఇశ్రాయేలీయుల నుండి కాపాడి, వారిని చంపకుండా చేశాడు.

  8. ఆ రోజు యెహోషువ యెహోవా ఎంచుకున్న స్థలంలో ఉండే బలిపీఠం యొక్క అవసరాలను తీర్చడానికి, గిబియోనీయులను సమాజం కోసం కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చేవారిగా చేశాడు. నేటికీ వారు అదే చేస్తున్నారు.