- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Gates గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అతడు ఒక కల కన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశాన్ని అంటి ఉంది. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను.
నీ సంతానం భూమిపై ఇసుక రేణువుల్లా అవుతారు, నీవు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తావు. భూమిపై ఉన్న సర్వ జనాంగాలు నీ ద్వార, నీ సంతానం ద్వార దీవించబడతారు.
నేను నీతో ఉంటాను, నీవు వెళ్లే ప్రతీ చోట నిన్ను సంరక్షిస్తాను, ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నిన్ను విడువను.”
యాకోబు నిద్రలేచి, “ఖచ్చితంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నారు, నేను అది గ్రహించలేకపోయాను” అని అనుకున్నాడు.
అతడు భయపడి ఇలా అన్నాడు, “ఈ స్థలం ఎంత అద్భుతమైనది! ఇది దేవుని మందిరమే కాని ఇంకొకటి కాదు; ఇది పరలోక ద్వారము.”
చిన్నవారికి పెద్దవారికి ఒకే విధంగా తమ కుటుంబాల ప్రకారం, ప్రతి ఒక్క ద్వారం దగ్గర కావలివారిగా ఉండడానికి చీట్లు వేశారు.
తూర్పు వైపు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. తర్వాత తెలివిగల సలహాదారుడైన అతని కుమారుడైన జెకర్యాకు కూడా చీటి వేయగా అతనికి ఉత్తరం వైపు ద్వారం వచ్చింది.
ఓబేద్-ఎదోముకు దక్షిణం వైపు ద్వారం వచ్చింది, గిడ్డంగుల కాపలా అతని కుమారులకు వచ్చింది.
పడమటి వైపు ద్వారం, ఎత్తైన రహదారిలో ఉన్న షల్లెకెతు ద్వారం కాపలా షుప్పీముకు, హోసాకు వచ్చింది.
ప్రతిరోజు తూర్పున ఆరుగురు లేవీయులు, ఉత్తరాన నలుగురు, దక్షిణాన నలుగురు, గిడ్డంగి దగ్గర ఇద్దరిద్దరు ఉన్నారు.
పడమటి ఆవరణం విషయానికి వస్తే, దగ్గర ఉన్న రాజమార్గం దగ్గర నలుగురు, ఆవరణం దగ్గర ఇద్దరు ఉన్నారు.
కోరహు, మెరారి వారసులైన ద్వారపాలకుల విభాగాలు ఇవి.
యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి యూదా రాజులు వెళ్లే ప్రజల ద్వారం దగ్గర నిలబడు. యెరూషలేము యొక్క అన్ని ఇతర ద్వారాల దగ్గర కూడా నిలబడు.
నీవు వారితో, ‘ఈ ద్వారాల గుండా వచ్చే యూదా రాజులారా, సర్వ యూదా ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా మాట వినండి.
ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని పాపపరిహారబలిగా అతి పరిశుద్ధ స్థలం లోపలికి తీసుకెళ్తాడు, కాని వాటి శరీరాలు శిబిరం బయటే దహించబడతాయి.
కాబట్టి, యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పాపాల నుండి శుద్ధి చేయడానికి పట్టణ ద్వారానికి బయటే బాధపడ్డాడు.
కాబట్టి మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాము.
ఆ పట్టణానికి గొప్ప ఎత్తైన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి.
మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి.