Skip to content

Decision గురించి బైబిల్ వచనాలు: General references

26 వచనాలు · 26 కోణాలు

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.

  2. నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.

  3. నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు. నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.

  4. నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.

  5. “నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు.

  6. మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా,

  7. ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

  8. క్రీస్తు యేసులో ప్రేమ, విశ్వాసం కలిగి, నీవు నా నుండి విన్న మంచిబోధను ఆదర్శంగా పాటించు.

  9. నీకు అప్పగించబడిన ఈ మంచి విషయాలను మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయంతో కాపాడు.

  10. అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము.

  11. కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,

  12. అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి;

  13. మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.

  14. దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.

  15. కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే ఎప్పుడూ తడబడరు.

  16. అప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యంలోనికి ఘనమైన స్వాగతం మీకు లభిస్తుంది.

  17. కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.

  18. అయితే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపలో జ్ఞానంలో వర్ధిల్లండి. ఆయనకు ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగును గాక! ఆమేన్.

  19. కాని, ప్రియ మిత్రులారా, అతిపరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ,

  20. మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి.

  21. నీకు కలుగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు, కాబట్టి పది రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను.

  22. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు.

  23. కాని నేను వచ్చేవరకు నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.’

  24. అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను.

  25. నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.