Skip to content

Curtains గురించి బైబిల్ వచనాలు: For tabernacle

21 వచనాలు · 3 కోణాలు

For tabernacle గురించి వచనాలు

  1. “నీవు సమావేశ గుడారానికి ఆవరణం నిర్మించాలి. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉండాలి.

  2. దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉండాలి.

  3. ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉండాలి, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉండాలి.

  4. “పడమటి వైపున ఆవరణం వెడల్పులో యాభై మూరల తెరలు ఉండాలి, వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉండాలి.

  5. తూర్పు వైపు అనగా సూర్యోదయం వైపు కూడా, ఆవరణం యాభై మూరల వెడల్పు ఉండాలి.

  6. ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు వాటికి మూడు దిమ్మలు ఉండాలి.

  7. అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉండాలి.

  8. “ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో చేసిన ఇరవై మూరల పొడవు గల తెర ఉండాలి. దానికి నాలుగు స్తంభాలు వాటికి నాలుగు దిమ్మలు ఉండాలి.

  9. ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నిటికి వెండి బద్దలు కొక్కేలు ఇత్తడి దిమ్మలు ఉండాలి.

  10. ఆవరణం పొడవు వంద మూరలు వెడల్పు యాభై మూరలు, ఎత్తు అయిదు మూరలు; అవి పేనిన నారతో చేసిన తెరలు వాటికి దిమ్మలు ఇత్తడివి.

  11. ఆ పనివారిలో నిపుణులైన వారందరు పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేశారు; వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లించారు.

  12. తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.

  13. వారు అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేశారు; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేశారు.

  14. తర్వాత వారు ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేశారు, రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేశారు.

  15. అంతేకాక వారు ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేశారు.

  16. తర్వాత వారు యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.

  17. వారు సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేశారు.

  18. పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.

  19. వారు అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలిపారు.

  20. అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు.

  21. దాన్ని ఒకటే గుడారమయ్యేలా వారు యాభై ఇత్తడి గుండీలు తయారుచేశారు.