Birds గురించి బైబిల్ వచనాలు: Habits of
Habits of గురించి వచనాలు
“నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది, అయినా కొంగకున్న రెక్కలు ఈకలతో అవి పోల్చబడకపోయినా.
అది నేలమీద గుడ్లు పెడుతుంది ఇసుకలో వాటిని పొదుగుతుంది.
ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని, ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు.
తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది; తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.
ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.
అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.
“దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?
నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి, తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?
ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.
అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది; దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి.
దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి, మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.”