Birds గురించి బైబిల్ వచనాలు: Appointed for food
Appointed for food గురించి వచనాలు
భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, ఆకాశంలోని అన్ని రకాల పక్షులు, నేల మీద తిరిగే ప్రతీ జీవి, సముద్రంలో ఉన్న అన్ని చేపలు మీకు భయపడతాయి భీతి చెందుతాయి; అవి మీ చేతికి అప్పగించబడ్డాయి.
జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను.
పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు.
కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,
ప్రతి రకమైన కాకి,
కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
పైడికంటే, గుడ్లగూబ, హంస,
గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,
సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.
ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.