Birds గురించి బైబిల్ వచనాలు: What species were unclean
What species were unclean గురించి వచనాలు
“ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద,
ప్రతి రకమైన కాకి,
కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ,
హంస, గూడబాతు, నల్లబోరువ,
సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
“ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి.
కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,
ప్రతి రకమైన కాకి,
కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
పైడికంటే, గుడ్లగూబ, హంస,
గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,
సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.