Skip to content

Atonement గురించి బైబిల్ వచనాలు

166 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి అతడు వాటిని యెహోవా ఎదుట అర్పించినప్పుడు ఆమె తన రక్తస్రావం నుండి ఆచారరీత్య శుద్ధి అవుతుంది. “ ‘మగశిశువుకు గాని ఆడపిల్లకు గాని జన్మనిచ్చే స్త్రీకి నియమాలు ఇవే.

  2. ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”

  3. “అప్పుడు యాజకుడు మగ గొర్రెపిల్లలలో ఒకదాన్ని తీసుకుని, అపరాధపరిహారబలిగా, కొంచెం నూనెతో పాటు అర్పించాలి; అతడు వాటిని పైకెత్తి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాలి.

  4. అతడు పాపపరిహారబలిని, దహనబలిని వధించే పరిశుద్ధాలయ ప్రాంతంలో గొర్రెపిల్లను వధించాలి. పాపపరిహారబలిలా, అపరాధపరిహారబలి కూడా యాజకునికే చెందుతుంది; అది అతిపరిశుద్ధము.

  5. యాజకుడు అపరాధపరిహారబలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి యొక్క కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి.

  6. అప్పుడు యాజకుడు కొంచెం నూనె తీసుకుని, తన ఎడమచేతి అరచేతిలో పోసి,

  7. తన కుడి చూపుడు వ్రేలు తన అరచేతిలో ఉన్న నూనెలో ముంచి, తన వ్రేలితో దానిలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరిస్తాడు.

  8. యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెలో కొంచెం శుద్ధి చేయబడవలసిన వ్యక్తి యొక్క కుడిచెవి యొక్క లోలాకుల మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడి పాదం యొక్క పెద్ద బొటనవ్రేలుపై, అపరాధపరిహారబలి పశువు రక్తం పైన ఉంచాలి.

  9. యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెను శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలమీద పూసి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.

  10. “అప్పుడు యాజకుడు అపవిత్రత పోగొట్టుకోవాలని వచ్చిన వారి కోసం పాపపరిహారబలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దహనబలి పశువును వధించాలి.

  11. దానిని భోజనార్పణతో కలిపి బలిపీఠం మీద అర్పించి, వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి, అప్పుడు వారు శుద్ధులవుతారు.

  12. “అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని,

  13. రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను, వారి స్థోమతను బట్టి ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసం తీసుకురావాలి.

  14. “ఎనిమిదవ రోజున వారు తమ శుద్ధీకరణ కోసం యెహోవా ఎదుటికి సమావేశ గుడారపు ద్వారం దగ్గర యాజకుని దగ్గరకి వాటిని తీసుకురావాలి.

  15. యాజకుడు అపరాధపరిహారబలిగా అర్పించేందుకు గొర్రెపిల్లతో పాటు కొంచెం నూనె కూడా తీసుకుని పైకెత్తి ప్రత్యేక అర్పణగా యెహోవా ఎదుట అర్పించాలి.

  16. అతడు అపరాధపరిహారబలిగా గొర్రెపిల్లను వధించి, దాని రక్తంలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి.

  17. యాజకుడు కొంచెం నూనె తన ఎడమ అరచేతిలో వేసుకుని,

  18. తన కుడి చూపుడు వ్రేలును దానిలో ముంచి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి.

  19. తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై ఉన్న అపరాధ బలి పశువు రక్తం మీద ఉంచాలి.

  20. యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలకు పూసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.

  21. అప్పుడు వారు తమ స్థోమతను బట్టి తీసుకువచ్చిన గువ్వలను పావురం పిల్లలను యాజకుడు తీసుకుని,

  22. పాపపరిహారబలిగా ఒకదాన్ని, దహనబలిగా ఒకదాన్ని సమర్పించాలి. వాటిని భోజనార్పణతో పాటు అర్పించాలి. ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”

  23. తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉండి తమ శుద్ధీకరణకు తీసుకురావలసిన అర్పణలను తీసుకురావడానికి స్థోమతలేని వారికి సంబంధించిన నియమాలు ఇవి.

  24. విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి.

  25. “అహరోను పాపపరిహారబలిగా ఒక కోడెదూడను తన కోసం తన ఇంటివారి ప్రాయశ్చిత్తం కోసం తీసుకురావాలి, దానిని తన పాపపరిహారబలిగా వధించాలి.