circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- లూకా 3:20సుమారు క్రీ.శ. 26
హేరోదు తాను చేసిన తప్పులు చాలవన్నట్టు యోహానును చెరసాలలో వేయించాడు.
- లూకా 3:21సుమారు క్రీ.శ. 26
ప్రజలందరు బాప్తిస్మం పొందుతున్నప్పుడు, యేసు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. ఆయన ప్రార్థిస్తుండగా, ఆకాశం తెరువబడింది,
- లూకా 3:22సుమారు క్రీ.శ. 26
పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకు దిగివచ్చాడు. పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినబడింది: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”
- లూకా 3:23సుమారు క్రీ.శ. 26
ఆ తర్వాత యేసు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించు ముప్పై యేండ్ల వయస్సు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని అనుకున్నారు, యోసేపు హేలీ కుమారుడు,
- లూకా 3:24సుమారు క్రీ.శ. 26
హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవీ కుమారుడు, లేవీ మెల్కి కుమారుడు, మెల్కి యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు,
- లూకా 3:25సుమారు క్రీ.శ. 26
యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నహూము కుమారుడు, నహూము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు,
- లూకా 3:26సుమారు క్రీ.శ. 26
నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,
- లూకా 3:27సుమారు క్రీ.శ. 26
యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు,
- లూకా 3:28సుమారు క్రీ.శ. 26
నేరి మెల్కీ కుమారుడు, మెల్కి అద్ది కుమారుడు, అద్ది కోసాం కుమారుడు, కోసాము ఎల్మాదాం కుమారుడు, ఎల్మాదాం ఏరు కుమారుడు,
- లూకా 3:29సుమారు క్రీ.శ. 26
ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవీ కుమారుడు,
- లూకా 3:30సుమారు క్రీ.శ. 26
లేవీ షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు,
- లూకా 3:31సుమారు క్రీ.శ. 26
ఎల్యాకీము మెలెయ కుమారుడు, మెలెయ మెన్నా కుమారుడు, మెన్నా మత్తతా కుమారుడు, మత్తతా నాతాను కుమారుడు, నాతాను దావీదు కుమారుడు,
- లూకా 3:32సుమారు క్రీ.శ. 26
దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,
- లూకా 3:33సుమారు క్రీ.శ. 26
నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము హెస్రోను కుమారుడు, హెస్రోను పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,
- లూకా 3:34సుమారు క్రీ.శ. 26
యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,
- లూకా 3:35సుమారు క్రీ.శ. 26
నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,
- లూకా 3:36సుమారు క్రీ.శ. 26
షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,
- లూకా 3:37సుమారు క్రీ.శ. 26
లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు,
- లూకా 3:38సుమారు క్రీ.శ. 26
కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.
- లూకా 4:1సుమారు క్రీ.శ. 27
యేసు, పరిశుద్ధాత్మపూర్ణుడై, యొర్దానును విడిచి వెళ్లారు. ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు.
- లూకా 4:2సుమారు క్రీ.శ. 27
అక్కడ నలభై రోజులు ఆయన అపవాది చేత శోధించబడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఆ రోజులు పూర్తి అవుతుండగా ఆయనకు ఆకలివేసింది.
- లూకా 4:3సుమారు క్రీ.శ. 27
అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు.
- లూకా 4:4సుమారు క్రీ.శ. 27
అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
- లూకా 4:5సుమారు క్రీ.శ. 27
తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు.
- లూకా 4:6సుమారు క్రీ.శ. 27
అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను.