కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోహాను 10:39సుమారు క్రీ.శ. 33

    వారు ఆయనను పట్టుకోవాలని మరల ప్రయత్నించారు, కానీ ఆయన వారి నుండి తప్పించుకున్నారు.

  2. యోహాను 10:40సుమారు క్రీ.శ. 33

    తర్వాత యేసు యొర్దాను నదిని దాటి, యోహాను మొదట బాప్తిస్మమిస్తూ ఉండిన ప్రాంతానికి తిరిగివచ్చి అక్కడ ఉన్నారు.

  3. యోహాను 10:41సుమారు క్రీ.శ. 33

    చాలామంది ఆయన దగ్గరకు వచ్చి, “యోహాను ఏ అద్భుత కార్యాన్ని చేయలేదు కాని ఈయన గురించి యోహాను చెప్పినవి అన్ని సత్యమే” అన్నారు.

  4. యోహాను 10:42సుమారు క్రీ.శ. 33

    ఆ స్థలంలో చాలామంది యేసును నమ్మారు.

  5. యోహాను 11:1సుమారు క్రీ.శ. 33

    బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు.

  6. యోహాను 11:2సుమారు క్రీ.శ. 33

    అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది.

  7. యోహాను 11:3సుమారు క్రీ.శ. 33

    కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు.

  8. యోహాను 11:4సుమారు క్రీ.శ. 33

    యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు.

  9. యోహాను 11:5సుమారు క్రీ.శ. 33

    యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు.

  10. యోహాను 11:6సుమారు క్రీ.శ. 33

    లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు.

  11. యోహాను 11:7సుమారు క్రీ.శ. 33

    ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు.

  12. యోహాను 11:8సుమారు క్రీ.శ. 33

    అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకుముందే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు.

  13. యోహాను 11:9సుమారు క్రీ.శ. 33

    అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు.

  14. యోహాను 11:10సుమారు క్రీ.శ. 33

    అతడు రాత్రివేళ నడిస్తే వెలుగు ఉండదు కాబట్టి అతడు తడబడతాడు” అని చెప్పారు.

  15. యోహాను 11:11సుమారు క్రీ.శ. 33

    యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. కాబట్టి నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు.

  16. యోహాను 11:12సుమారు క్రీ.శ. 33

    అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతే బాగవుతాడు” అన్నారు.

  17. యోహాను 11:13సుమారు క్రీ.శ. 33

    యేసు అతని చావు గురించి మాట్లాడారు. కాని వారు సాధారణమైన నిద్ర గురించి అనుకున్నారు.

  18. యోహాను 11:14సుమారు క్రీ.శ. 33

    కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.

  19. యోహాను 11:15సుమారు క్రీ.శ. 33

    అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను. దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు.

  20. యోహాను 11:16సుమారు క్రీ.శ. 33

    అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు.

  21. యోహాను 11:17సుమారు క్రీ.శ. 33

    యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు.

  22. యోహాను 11:18సుమారు క్రీ.శ. 33

    యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.

  23. యోహాను 11:19సుమారు క్రీ.శ. 33

    చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు.

  24. యోహాను 11:20సుమారు క్రీ.శ. 33

    మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.

  25. యోహాను 11:21సుమారు క్రీ.శ. 33

    మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.