circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- యోహాను 10:14సుమారు క్రీ.శ. 33
“నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణం పెడతాను.
- యోహాను 10:15సుమారు క్రీ.శ. 33
As the Father knoweth me, even so know I the Father: and I lay down my life for the sheep.
- యోహాను 10:16సుమారు క్రీ.శ. 33
ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడ నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వింటాయి, అప్పుడు ఒక్క మంద ఒక్క కాపరి ఉంటాడు.
- యోహాను 10:17సుమారు క్రీ.శ. 33
నేను నా ప్రాణాన్ని మళ్ళీ పొందడానికే దాన్ని పెడుతున్నాను, కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు.
- యోహాను 10:18సుమారు క్రీ.శ. 33
నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.
- యోహాను 10:19సుమారు క్రీ.శ. 33
ఈ మాటల వలన యూదులలో మరల భేదాలు ఏర్పడ్డాయి.
- యోహాను 10:20సుమారు క్రీ.శ. 33
వారిలో అనేకమంది, “ఇతడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇతనికి దయ్యం పట్టింది. ఇతని మాటలను ఎందుకు వింటున్నారు?” అన్నారు.
- యోహాను 10:21సుమారు క్రీ.శ. 33
కానీ మరికొందరు, “ఇవి దయ్యం పట్టినవాని మాటలు కాదు, ఒక దయ్యం గ్రుడ్డివాడికి చూపు ఇవ్వగలదా?” అని అడిగారు.
- యోహాను 10:22సుమారు క్రీ.శ. 33
ఆ తర్వాత యెరూషలేములో ప్రతిష్ఠిత పండుగ సమీపించింది. అది శీతాకాలము.
- యోహాను 10:23సుమారు క్రీ.శ. 33
యేసు దేవాలయ ఆవరణంలో సొలొమోను మండపంలో నడుస్తున్నారు.
- యోహాను 10:24సుమారు క్రీ.శ. 33
అప్పుడు యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో, “ఇంకా ఎంతకాలం నీవు మమ్మల్ని సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
- యోహాను 10:25సుమారు క్రీ.శ. 33
అందుకు యేసు వారితో, “నేను మీకు చెప్పాను కాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేసిన అద్భుతకార్యాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
- యోహాను 10:26సుమారు క్రీ.శ. 33
కాని మీరు నా గొర్రెలు కారు కాబట్టి మీరు నమ్మరు.
- యోహాను 10:27సుమారు క్రీ.శ. 33
నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు అవి నన్ను వెంబడిస్తాయి.
- యోహాను 10:28సుమారు క్రీ.శ. 33
నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కాబట్టి అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు.
- యోహాను 10:29సుమారు క్రీ.శ. 33
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు; నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరు దొంగిలించలేరు.
- యోహాను 10:30సుమారు క్రీ.శ. 33
నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.
- యోహాను 10:31సుమారు క్రీ.శ. 33
ఆయనకు విరోధంగా ఉన్న యూదులు మళ్ళీ ఆయనను కొట్టాలని రాళ్లను పట్టుకున్నారు.
- యోహాను 10:32సుమారు క్రీ.శ. 33
అయితే యేసు వారితో, “నా తండ్రి నుండి మీకు అనేక మంచి కార్యాలను చూపించాను. వాటిలో దేన్ని బట్టి నన్ను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారా?” అని అడిగారు.
- యోహాను 10:33సుమారు క్రీ.శ. 33
“అందుకు యూదులు, నీవు చేసిన మంచిపనుల బట్టి కాదు. నీవు మానవుడవై ఉండి దేవుడనని చెప్పుకుంటూ దైవదూషణ చేస్తున్నందుకు” అని అన్నారు.
- యోహాను 10:34సుమారు క్రీ.శ. 33
యేసు వారితో, “ ‘మీరు “దేవుళ్ళు” అని నేను అన్నాను’ అని మీ లేఖనాల్లో వ్రాసిలేదా?
- యోహాను 10:35సుమారు క్రీ.శ. 33
దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టివేయడానికి లేదు; దేవుని వాక్యాన్ని పొందుకొనిన వారినే ఆయన ‘దేవుళ్ళు’ అని పిలిచినప్పుడు,
- యోహాను 10:36సుమారు క్రీ.శ. 33
తండ్రి తన సొంతవానిగా ప్రత్యేకపరచుకుని లోకానికి పంపినవాని సంగతేమిటి? ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పినందుకు దైవదూషణ అని నాపైన నేరం ఎందుకు మోపుతున్నారు?
- యోహాను 10:37సుమారు క్రీ.శ. 33
నేను నా తండ్రి పనులను చేయకపోతే నన్ను నమ్మకండి.
- యోహాను 10:38సుమారు క్రీ.శ. 33
అయితే నేను వాటిని చేస్తే మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలో ఉన్నాడని నేను తండ్రిలో ఉన్నానని మీరు తెలుసుకుని గ్రహించేలా, నేను చేసే క్రియలను నమ్మండి” అని చెప్పారు.