కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోహాను 4:39సుమారు క్రీ.శ. 30

    ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసిందంతా నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఆయనను గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు.

  2. యోహాను 4:40సుమారు క్రీ.శ. 30

    ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో ఉండమని వేడుకున్నప్పుడు ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నారు.

  3. యోహాను 4:41సుమారు క్రీ.శ. 30

    ఆయన మాటలు విని ఇంకా చాలామంది విశ్వాసులయ్యారు.

  4. యోహాను 4:42సుమారు క్రీ.శ. 30

    వారు ఆ స్త్రీతో, “నీవు చెప్పిన దానిని బట్టి కాదు; కాని మాకు మేమే విని నిజంగా ఈయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నాం” అన్నారు.

  5. యోహాను 4:43సుమారు క్రీ.శ. 30

    రెండు రోజుల తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లారు.

  6. యోహాను 4:44సుమారు క్రీ.శ. 30

    ఒక ప్రవక్త తన స్వదేశంలో గౌరవం పొందడని యేసే స్వయంగా సాక్ష్యమిచ్చారు.

  7. యోహాను 4:45సుమారు క్రీ.శ. 30

    ఆయన గలిలయకు చేరగానే గలిలయులు ఆయనను ఆహ్వానించారు. పస్కా పండుగ సమయంలో వారందరు అక్కడే ఉన్నారు కాబట్టి యెరూషలేములో ఆయన చేసిన కార్యాలన్నిటిని వారు చూశారు.

  8. యోహాను 4:46సుమారు క్రీ.శ. 30

    ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాకు మరలా వచ్చారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు.

  9. యోహాను 4:47సుమారు క్రీ.శ. 30

    యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కుమారుని స్వస్థపరచుమని బ్రతిమాలుకున్నాడు.

  10. యోహాను 4:48సుమారు క్రీ.శ. 30

    యేసు అతనితో, “మీరు అద్భుతకార్యాలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు” అన్నారు.

  11. యోహాను 4:49సుమారు క్రీ.శ. 30

    ఆ రాజ్యాధికారి, “అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి” అని వేడుకున్నాడు.

  12. యోహాను 4:50సుమారు క్రీ.శ. 30

    యేసు, “వెళ్లు, నీ కుమారుడు బ్రతుకుతాడు” అని చెప్పారు. యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు.

  13. యోహాను 4:51సుమారు క్రీ.శ. 30

    అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి అతని కుమారుడు బాగయ్యాడని చెప్పారు.

  14. యోహాను 4:52సుమారు క్రీ.శ. 30

    అతడు తన కుమారుడు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది” అని వారు చెప్పారు.

  15. యోహాను 4:53సుమారు క్రీ.శ. 30

    అప్పుడు ఆ తండ్రి యేసు తనతో, “నీ కుమారుడు బ్రతుకుతాడు” అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి అతడు, అతని ఇంటివారందరు నమ్మారు.

  16. యోహాను 4:54సుమారు క్రీ.శ. 30

    యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ సూచకక్రియ ఇది.

  17. యోహాను 5:1సుమారు క్రీ.శ. 31

    కొంతకాలం తర్వాత యూదుల పండుగకు యేసు యెరూషలేముకు వెళ్లారు.

  18. యోహాను 5:2సుమారు క్రీ.శ. 31

    యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ అయిదు మండపాలు ఉన్నాయి.

  19. యోహాను 5:3సుమారు క్రీ.శ. 31

    ఇక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం కలవారు, అనేక రకాల రోగాలు కలిగినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు.

  20. యోహాను 5:4సుమారు క్రీ.శ. 31

    ఎప్పటికప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవాడు. నీరు కదిలిన ప్రతిసారి ఆ కోనేటిలోనికి ఎవరు మొదట దిగితే వారికి ఏ రోగం ఉన్నా దాని నుండి బాగుపడేవారు. కాబట్టి అక్కడున్నవారు ఆ నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూసేవారు.

  21. యోహాను 5:5సుమారు క్రీ.శ. 31

    ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదల్లేని స్థితిలో ఉన్న ఒక రోగి అక్కడ ఉన్నాడు.

  22. యోహాను 5:6సుమారు క్రీ.శ. 31

    చాలాకాలంగా అతడు అదే స్థితిలో అక్కడ పడి ఉన్నాడని తెలుసుకున్న యేసు, అతన్ని చూసి, “నీవు బాగవ్వాలని కోరుతున్నావా?” అని అడిగారు.

  23. యోహాను 5:7సుమారు క్రీ.శ. 31

    ఆ కదల్లేనివాడు, “అయ్యా, నీరు కదిలినప్పుడు కోనేటిలోనికి దిగడానికి నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను దానిలోనికి దిగడానికి ప్రయత్నించేలోపు నాకన్నా ముందు మరొకరు దిగిపోతున్నారు” అని సమాధానం చెప్పాడు.

  24. యోహాను 5:8సుమారు క్రీ.శ. 31

    అప్పుడు యేసు వానితో, “లేచి, నీ పరుపెత్తుకొని నడువు” అన్నారు.

  25. యోహాను 5:9సుమారు క్రీ.శ. 31

    వెంటనే అతడు స్వస్థత పొంది, తన పరుపెత్తుకొని నడిచాడు. ఇది సబ్బాతు దినాన జరిగింది.