- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 4:28సుమారు క్రీ.పూ. 1490
వారు చేసిన పాపం తెలియ వచ్చినప్పుడు, వారు చేసిన పాపం కోసం తమ అర్పణగా లోపం లేని ఆడ మేకను తీసుకురావాలి.
- లేవీయకాండము 4:29సుమారు క్రీ.పూ. 1490
వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి.
- లేవీయకాండము 4:30సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు యాజకుడు తన వ్రేలితో కొంత రక్తాన్ని తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
- లేవీయకాండము 4:31సుమారు క్రీ.పూ. 1490
సమాధానబలి నుండి క్రొవ్వును తీసినట్లే వారు కొవ్వంతా తీస్తారు, యాజకుడు దానిని బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
- లేవీయకాండము 4:32సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి.
- లేవీయకాండము 4:33సుమారు క్రీ.పూ. 1490
వారు దాని తలపై చేయి వేసి దహనబలిని వధించిన స్థలంలో దానిని పాపపరిహారబలిగా వధించాలి.
- లేవీయకాండము 4:34సుమారు క్రీ.పూ. 1490
అప్పుడు యాజకుడు పాపపరిహారబలిలో కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
- లేవీయకాండము 4:35సుమారు క్రీ.పూ. 1490
సమాధానబలి యొక్క గొర్రెపిల్ల నుండి క్రొవ్వును తీసినట్లే వారు సమస్త క్రొవ్వును తీస్తారు, యాజకుడు దానిని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
- లేవీయకాండము 5:1సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఒకవేళ ఎవరైనా ఒట్టు పెట్టుకోవడం వల్ల తాము చూసిన దాని గురించి గాని తమకు తెలిసిన దాని గురించి గాని నిజం చెప్పాల్సి ఉండి దాని గురించి వారు మాట్లాడకుండా పాపం చేస్తే, దానికి వారే శిక్షను భరిస్తారు.
- లేవీయకాండము 5:2సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఒకవేళ ఎవరైనా తాము అపరాధులని తెలుసుకుంటే పొరపాటున ఆచారరీత్య అపవిత్రమైన దానిని తాకితే (అపవిత్రమైన జంతువు కళేబరం, అది అడవిదైనా పెంపుడుదైనా, లేదా భూమి మీద ప్రాకే జీవియైనా కావచ్చు), వారు అపవిత్రులయ్యారు అని వారికి అవగాహన లేకపోతే, తర్వాత తాము గ్రహిస్తే,
- లేవీయకాండము 5:3సుమారు క్రీ.పూ. 1490
లేదా ఒకవేళ వారు పొరపాటున మనుష్యులను అపవిత్రం చేసే దేనినైనా తాకితే, దాని గురించి తెలుసుకున్నా తర్వాత వారు అపరాధులు అవుతారు,
- లేవీయకాండము 5:4సుమారు క్రీ.పూ. 1490
లేదా మనుష్యులెవరైనా అనాలోచితంగా మంచి గాని చెడు గాని చేస్తానని పొరపాటున ప్రమాణం చేసి, దాని గురించి తెలిసిన తర్వాత వారు అపరాధులు అని గ్రహిస్తారు.
- లేవీయకాండము 5:5సుమారు క్రీ.పూ. 1490
ఎవరైనా ఈ విషయాల్లో అపరాధులని గ్రహిస్తే, వారు ఏ విధంగా పాపం చేశారో అది ఒప్పుకోవాలి.
- లేవీయకాండము 5:6సుమారు క్రీ.పూ. 1490
వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.
- లేవీయకాండము 5:7సుమారు క్రీ.పూ. 1490
“ ‘గొర్రెపిల్లను కొనలేని వారెవరైనా వారి పాపానికి జరిమానాగా రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను యెహోవా దగ్గరకు తీసుకురావాలి, వాటిలో ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసము.
- లేవీయకాండము 5:8సుమారు క్రీ.పూ. 1490
అతడు వాటిని యాజకుడి దగ్గరకు తీసుకురావాలి, యాజకుడు మొదట పాపపరిహారబలి అర్పిస్తాడు. అతడు దాని తలను దాని మెడ నుండి పూర్తిగా వేరు చేయకుండ, మెలిపెట్టాలి, తల విరిచేయకూడదు,
- లేవీయకాండము 5:9సుమారు క్రీ.పూ. 1490
పాపపరిహారబలి యొక్క రక్తంలో కొంత భాగాన్ని బలిపీఠం వైపు చల్లాలి; మిగిలిన రక్తం బలిపీఠం యొక్క అడుగు నుండి బయటకు పంపాలి. ఇది పాపపరిహారబలి.
- లేవీయకాండము 5:10సుమారు క్రీ.పూ. 1490
యాజకుడు మరొకదాన్ని నిర్ణీత విధానంలో దహనబలిగా అర్పించి, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వారు క్షమించబడతారు.
- లేవీయకాండము 5:11సుమారు క్రీ.పూ. 1490
“ ‘అయితే, ఒకవేళ వారు రెండు పావురాలు లేదా రెండు గువ్వలను కొనలేకపోతే, వారు తమ పాపానికి బలిగా పాపపరిహారబలి కోసం ఒక ఓమెరు నాణ్యమైన పిండి తీసుకురావాలి. వారు దానిపై ఒలీవనూనె గాని ధూపం గాని పెట్టకూడదు, ఎందుకంటే అది పాపపరిహారబలి.
- లేవీయకాండము 5:12సుమారు క్రీ.పూ. 1490
వారు దానిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి, అతడు దానిలో ఒక చేతినిండ భాగాన్ని జ్ఞాపక భాగంగా తీసుకుని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఇది పాపపరిహారబలి.
- లేవీయకాండము 5:13సుమారు క్రీ.పూ. 1490
ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”
- లేవీయకాండము 5:14సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
- లేవీయకాండము 5:15సుమారు క్రీ.పూ. 1490
“యెహోవాకు చెందిన పరిశుద్ధమైన వాటిలో దేని విషయంలోనైనా, ఎవరైనా అనుకోకుండ పాపం చేసి ఎవరైనా యెహోవా పట్ల నమ్మకద్రోహులైతే, వారు మంద నుండి లోపం లేని, పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం, వెండిలో సరియైన విలువగల ఒక పొట్టేలును ప్రాయశ్చిత్తంగా తీసుకురావాలి. ఇది అపరాధపరిహారబలి.
- లేవీయకాండము 5:16సుమారు క్రీ.పూ. 1490
ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
- లేవీయకాండము 5:17సుమారు క్రీ.పూ. 1490
“ఎవరైనా పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు, అది వారికి తెలియకపోయినా సరే, వారు అపరాధులు, కాబట్టి వారు శిక్ష భరిస్తారు.