కంటెంట్‌కు వెళ్లండి

Mahanaim

13 verses

32.2100, 35.6300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Mahanaim ను ప్రస్తావించే వచనాలు

  1. యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు.

  2. హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు;

  3. వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు,

  4. గాదు గోత్రం నుండి: గిలాదులో ఉన్న రామోతు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), మహనయీము,

  5. ఆ సమయంలో, నేరు కుమారుడును సౌలు సేనాధిపతియైన అబ్నేరు అనేవాడు సౌలు కుమారుడైన ఇష్-బోషెతును మహనయీముకు తీసుకెళ్లాడు.

  6. నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్-బోషెతు మనుష్యులతో కలిసి మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వెళ్లారు.

  7. అబ్నేరు అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు. వారు యొర్దాను నదిని దాటి, ఉదయ కాలంలో ప్రయాణం కొనసాగించి మహనయీముకు చేరుకున్నారు.

  8. దావీదు మహనయీముకు చేరుకున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులతో కలిసి యొర్దాను నది దాటి వెళ్లిపోయారు.

  9. దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల పట్టణమైన రబ్బాకు చెందిన నాహాషు కుమారుడైన షోబీ, లోదెబారుకు చెందిన అమ్మీయేలు కుమారుడైన మాకీరు, రోగెలీముకు చెందిన గిలాదీయుడైన బర్జిల్లయిలు,

  10. బర్జిల్లయి ఎనభై సంవత్సరాల ముసలివాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి భోజన పదార్ధాలు సరఫరా చేసేవాడు.

  11. “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.

  12. మహనయీముకు ఇద్దో కుమారుడైన అహీనాదాబు అధికారి;

  13. గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము,