కంటెంట్‌కు వెళ్లండి

Heshbon

37 verses

31.8000, 35.8000 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Heshbon ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “తర్వాత ఇశ్రాయేలీయులు హెష్బోనులో ఏలే అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి, ‘మా స్థలానికి వెళ్లడానికి మీ దేశం గుండా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడిగారు.

  2. మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు హెష్బోను, అరోయేరు, చుట్టుప్రక్కల స్థావరాలను, అర్నోనులో ఉన్న అన్ని పట్టణాలను ఆక్రమించింది. ఆ సమయంలో మీరు వాటిని ఎందుకు తిరిగి తీసుకోలేదు?

  3. హెష్బోను, యాజెరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.

  4. “మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  5. నీ మెడ దంతపు గోపురం లాంటిది. మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న హెష్బోను కొలనులాంటివి. మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న లెబానోను గోపురం లాంటిది.

  6. హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు, యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది. కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు, వారి హృదయాలు క్రుంగిపోతాయి.

  7. హెష్బోను పొలాలు, షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి. యాజెరు వరకు వ్యాపించిన అరణ్యం వరకు ప్రాకిన శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను దేశాల పాలకులు త్రొక్కివేశారు. వాటి తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.

  8. అందువల్ల యాజెరు ఏడ్చినట్లు నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ ఎల్యాలెహు, నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. నీ పండిన ఫలాల కోసం నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.

  9. మోయాబును ఇకపై పొగడరు; హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ మద్మేను ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; ఖడ్గం నిన్ను వెంటాడుతుంది.

  10. “నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.

  11. “పారిపోయినవారు హెష్బోను నీడలో బలహీనులై నిలబడి ఉన్నారు, హెష్బోను నుండి అగ్ని, సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి. అది మోయాబు నొసళ్లను, అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.

  12. “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.