కంటెంట్‌కు వెళ్లండి

Gibeon

35 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Gibeonite

31.8400, 35.1800 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gibeon ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, వారు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయుల సైన్యాన్ని తరుముతూ వారిని హతం చేశారు.

  2. దావీదు యాజకుడైన సాదోకును, అతని తోటి యాజకులను గిబియోనులోని ఆరాధన స్థలంలో ఉన్న యెహోవా సమావేశ గుడారం దగ్గర ఉంచాడు.

  3. మోషే అరణ్యంలో చేయించిన యెహోవా సమావేశ గుడారం, దహనబలి బలిపీఠం ఆ కాలంలో గిబియోనులోని ఎత్తైన స్థలంలో ఉన్నాయి.

  4. సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది.

  5. తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు.

  6. ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు.

  7. గిబియోను వారసులు 95.

  8. అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు,

  9. తమ సైనికులందరిని తీసుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్లారు. వారు గిబియోనులోని పెద్ద కొలను దగ్గర అతన్ని పట్టుకున్నారు.

  10. అప్పుడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను హత్యచేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఇష్మాయేలు దగ్గర ప్రాణాలతో మిగిలి ఉన్న ప్రజలందరినీ అనగా గిబియోను నుండి ఇష్మాయేలు తీసుకెళ్లిన సైనికులను, స్త్రీలను, పిల్లలను ఆస్థాన అధికారులను తిరిగి తీసుకువచ్చారు.