కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయినా నేటి వరకు గ్రహించే మనస్సును గాని, చూసే కళ్లను గాని, వినే చెవులను గాని యెహోవా మీకు ఇవ్వలేదు.

  2. మీరు రొట్టెలు తినలేదు ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకుంటారని ఇలా చేశాను.”

  3. మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారం, నేడు మిమ్మల్ని తనకు ప్రజలుగా నియమించుకొని తానే మీకు దేవుడైయుండేలా మీ దేవుడైన యెహోవా నేడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణంలోను మీరు ఈ రోజున మీరంతా అనగా మీ నాయకులు, ముఖ్య పురుషులు, మీ పెద్దలు, అధికారులు, ఇశ్రాయేలీయులలో ఇతర పురుషులందరు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ పాళెంలో నివసిస్తున్న విదేశీయులు, మీ కట్టెలను నరికేవారు, మీ నీటిని తోడేవారు, అందరు నేడు మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడికలోకి ప్రవేశించడానికి ఇక్కడ నిలబడి ఉన్నారు, ఈ రోజు యెహోవా ప్రమాణం చేయడం ద్వారా, ఈ రోజు మిమ్మల్ని తన ప్రజలుగా నియమించుకొని, ఆయన మీకు వాగ్దానం చేసినట్లుగా మీ తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసినట్లుగా మీ దేవునిగా ఉంటారు.

  4. That thou shouldest enter into covenant with the LORD thy God, and into his oath, which the LORD thy God maketh with thee this day:

  5. That he may establish thee to day for a people unto himself, and that he may be unto thee a God, as he hath said unto thee, and as he hath sworn unto thy fathers, to Abraham, to Isaac, and to Jacob.

  6. మా దేవుడైన యెహోవా సన్నిధిలో ఈ రోజు మాతో పాటు నిలబడ్డ వారు కానీ ఈ రోజు ఇక్కడ లేని వారితో కూడా ఉన్నారు.

  7. ఆ దేశాల దేవుళ్ళను సేవించడానికి వెళ్లి మన దేవుడైన యెహోవా నుండి తమ హృదయాన్ని మనస్సు ప్రక్కకు త్రిప్పుకున్న పురుషుడు గాని, స్త్రీ గాని, వంశం గాని గోత్రం గాని లేరనే విషయాన్ని నిర్ధారించుకోండి; అటువంటి చేదు విషాన్ని ఉత్పత్తి చేసే మూలం మీ మధ్యలో లేదనేది నిర్ధారించుకోండి.

  8. యెహోవా వారిని క్షమించడానికి ఎన్నటికీ ఇష్టపడరు; ఆయన కోపం, రోషం వారిపై భగ్గుమంటాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ వారి పైకి వస్తాయి, యెహోవా ఆకాశం క్రిందనుండి వారి పేర్లను తుడిచివేస్తారు.

  9. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడిక యొక్క అన్ని శాపాల ప్రకారం, కీడు కలుగజేయడానికి యెహోవా వారిని ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రాల నుండి వేరు చేస్తారు.

  10. తర్వాతి తరాలలో మిమ్మల్ని అనుసరించే మీ పిల్లలు, సుదూర దేశాల నుండి వచ్చిన విదేశీయులు, దేశంపై పడిన ఆపదలను, వ్యాధులను వేటితోనైతే యెహోవా దాన్ని బాధించారో చూస్తారు.

  11. దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది.

  12. దేశాలన్నీ, “ఈ దేశానికి యెహోవా ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ భయంకరమైన, మండుతున్న కోపం?” అని అడుగుతాయి.

  13. దానికి సమాధానం ఇలా ఉంటుంది: “ఈ ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవా ఒడంబడికను, ఆయన వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన వారితో చేసుకున్న ఒడంబడికను విడిచిపెట్టారు.

  14. వారు వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించారు, వారికి నమస్కరించారు, వారు వారికి తెలియని దేవుళ్ళు, ఆయన వారికి ఇవ్వని దేవుళ్ళు.

  15. అందువల్ల ఆ దేశంపై యెహోవా కోపం భగ్గుమంది, అందుకే గ్రంథంలో వ్రాయబడి ఉన్న అన్ని శాపాలను ఆయన వారి పైకి తీసుకువచ్చారు.

  16. యెహోవా భీకరమైన కోపంలో, గొప్ప క్రోధంలో వారి దేశంలో నుండి వారిని పెకిలించి, ఇప్పుడున్నట్లుగా, వారిని వేరే దేశంలోకి నెట్టివేశారు.”

  17. రహస్య విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కానీ వెల్లడించబడిన విషయాలు మనకు మన పిల్లలకు ఎప్పటికీ ఉంటాయి, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ మనం పాటించాలి.

  18. నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని,

  19. మీరు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగివచ్చి, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ప్రతీదాని ప్రకారం మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడితే,

  20. మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు, మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు.

  21. మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు.

  22. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ పూర్వికులకు చెందిన దేశానికి తీసుకువస్తారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ పూర్వికులకంటే ఆయన మిమ్మల్ని వృద్ధిలోను, సంఖ్యలోను అధికం చేస్తారు.

  23. మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు.

  24. మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు.

  25. మీరు తిరిగివచ్చిన తర్వాత యెహోవాకు లోబడి ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తారు.