కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జనాంగాలన్నిటిని వెళ్లగొడతారు. మీకంటే విస్తారమైన, బలమైన దేశాలను మీరు వెళ్లగొడతారు.

  2. మీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీరు వెళ్లే దేశమంతటికి మీరంటే వణుకును భయాన్ని పుట్టిస్తారు.

  3. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడితే మీకు దీవెన;

  4. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం.

  5. మీరు స్వాధీనం చేసుకోబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చిన తర్వాత, గెరిజీము పర్వతం మీద దీవెనను ఏబాలు పర్వతంమీద శాపాన్ని ప్రకటించాలి.

  6. మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను నది దాటబోతున్నారు. మీరు దానిని స్వాధీనం చేసుకుని దానిలో నివసించినప్పుడు,

  7. మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో మీరు నివసించినంత కాలం మీరు జాగ్రత్తగా అనుసరించవలసిన శాసనాలు చట్టాలు ఇవి.

  8. మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు.

  9. కాని మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటిలో తన పేరును స్థాపించడానికి ఆయనకు నివాస స్థానంగా ఏర్పరచుకొనే స్థలాన్ని మీరు వెదికి ఆ స్థలానికి మీరు వెళ్లాలి;

  10. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.

  11. ఎందుకంటే, ఇంకా మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న విశ్రాంతి స్థలానికి వారసత్వ దేశాన్ని చేరుకోలేదు.

  12. అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు.

  13. అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.

  14. అక్కడ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు దాసీలు, భాగం గాని స్వాస్థ్యం గాని లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.

  15. మీ గోత్రాల్లో ఒకదానిలో యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే మీ దహనబలులు అర్పించి, అక్కడే నేను ఆజ్ఞాపించే వాటన్నిటిని జరిగించాలి.

  16. అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం, మీ ఇళ్ళలో ఉన్న పశువులను, జింకను లేదా దుప్పిని తిన్నట్లుగా మీకు ఇష్టం వచ్చినంత మాంసాన్ని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు, అపవిత్రులైనవారు దానిని తినవచ్చు.

  17. అయితే మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంలోనే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉండే లేవీయులు, అందరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.

  18. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మీ సరిహద్దులు విశాలపరచినప్పుడు, మీకు మాంసం తినాలనే ఆశ కలిగి, “నేను కొంత మాంసాన్ని తింటాను” అని అనుకోవచ్చు. అప్పుడు మీకు కావలసినంత మాంసాన్ని తినవచ్చు.

  19. మీ దేవుడైన యెహోవా తన నామం కోసం ఏర్పరచుకున్న స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, యెహోవా మీకు ఇచ్చిన పశువుల్లో, మందలో నుండి పశువులను వధించి, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ స్వస్థలాలలోనే మీకు కావలసినంత మాంసాన్ని మీరు తినవచ్చు.

  20. యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి దానిని తినకండి, అప్పుడు మీకు మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలుగుతుంది.

  21. అయితే మీ పవిత్ర వస్తువులను, మీరు ఇస్తానని మ్రొక్కుబడి చేసినవన్నీ తీసుకుని, యెహోవా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లండి.

  22. మీ దహనబలులను, వాటి రక్తమాంసాలను మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయాలి, అయితే ఆ మాంసాన్ని మీరు తినవచ్చు.

  23. మీ దేవుడైన యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి మీకు, మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలిగేలా నేను మీకు ఇస్తున్న నిబంధనలన్నిటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి.

  24. మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత,

  25. వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.