కంటెంట్‌కు వెళ్లండి

Aaron

331 వచనాలు · 9 కుటుంబ సభ్యులు

Aaron ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రజల నిమిత్తం అహరోను సమాధానబలిగా ఎద్దును, పొట్టేలును వధించాడు. అతని కుమారులు అతనికి రక్తాన్ని అందించగా, అతడు బలిపీఠం చుట్టూరా దానిని చల్లాడు.

  2. మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్ని, కుడి తొడను పైకెత్తి ఊపి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.

  3. తర్వాత అహరోను ప్రజల వైపు చేతులెత్తి వారిని దీవించాడు. పాపపరిహారబలి, దహనబలి, సమాధానబలి అర్పించిన తర్వాత బలిపీఠం నుండి దిగివచ్చాడు.

  4. అప్పుడు మోషే అహరోనులు కలిసి సమావేశ గుడారం లోనికి వెళ్లారు. వారు బయటకు వచ్చినప్పుడు ప్రజలను దీవించారు; యెహోవా మహిమ ప్రజలందరికి కనిపించింది.

  5. అహరోను కుమారులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను తీసుకుని, వాటిలో నిప్పు ఉంచి దానిపై ధూపం వేశారు; వారు యెహోవా ఎదుట ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా అనధికార అగ్నిని సమర్పించారు.

  6. అప్పుడు మోషే అప్పుడు అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్పారు: “ ‘నన్ను సమీపించేవారి ద్వారా నేను నా పరిశుద్ధతను కనుపరచుకుంటాను; ప్రజలందరి దృష్టిలో నేను ఘనపరచబడతాను.’ ” అహరోను మౌనంగా ఉండిపోయాడు.

  7. మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫానులను పిలిపించి వారితో, “ఇక్కడకు రండి; మీ బంధువులను పరిశుద్ధాలయం ఎదుట నుండి, బయటకు తీసుకెళ్లండి” అని అన్నాడు.

  8. మోషే అహరోనుతో అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో, “మీరు చావకూడదన్నా, యెహోవా ఆగ్రహం ఈ సమాజం మీదికి రావద్దన్నా మీరు మీ జుట్టు విరబోసుకోవద్దు, మీ బట్టలు చింపుకోవద్దు, అయితే యెహోవా అగ్నితో వారిని నాశనం చేసినందుకు మీ బంధువులైన ఇశ్రాయేలీయులందరు దుఃఖించవచ్చు.

  9. తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నారు,

  10. మోషే అహరోనుతో అతని కుమారులలో మిగతా వారైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు, “యెహోవాకు సమర్పించిన హోమబలిలో మిగిలిన భోజనార్పణ పులుపు లేకుండ తీసుకుని బలిపీఠం ప్రక్కన తినండి, ఎందుకంటే అది అతిపరిశుద్ధమైనది.

  11. పాపపరిహారబలి కొరకైన మేక గురించి మోషే ఆరా తీయగా, అది కాలిపోయిందని తెలుసుకుని, అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారులపై కోప్పడి,

  12. అందుకు అహరోను మోషేతో, “ఈ రోజు వారు యెహోవా ఎదుట వారి పాపపరిహారబలి, దహనబలి అర్పించారు, అయినా నా పట్ల ఇలాంటి విషాదం జరిగింది. ఈ రోజు ఒకవేళ నేను పాపపరిహారబలి తినివుంటే యెహోవా ఆనందించి ఉండేవారా?” అని అడిగాడు.

  13. యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,

  14. యెహోవా మోషే అహరోనులతో అన్నారు,

  15. “మనుష్యులెవరికైనా వారి చర్మంపై వాపు లేదా దద్దుర్లు లేదా మెరిసే మచ్చ ఉన్నట్లయితే, అది అపవిత్రమైన కుష్ఠువ్యాధి కావచ్చు, వారు యాజకుడైన అహరోను దగ్గరకు లేదా యాజకుడుగా ఉన్న అతని కుమారులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడాలి.

  16. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,

  17. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,

  18. అహరోను ఇద్దరు కుమారులు అనధికార నిప్పుతో యెహోవాను సమీపించినప్పుడు వారు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడారు.

  19. యెహోవా మోషేతో అన్నారు: “నీ సహోదరుడైన అహరోను మందసం మీద ఉన్న ప్రాయశ్చిత్త మూతకు ఎదురుగా ఉన్న తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడంటే అప్పుడు రావద్దు అని చెప్పు, అలా వస్తే అతడు చస్తాడు. ఎందుకంటే నేను మేఘంలో ఆ ప్రాయశ్చిత్త మూత మీదే మీకు ప్రత్యక్షమవుతాను.

  20. “అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే విధానం ఇది: మొదట అతడు పాపపరిహారబలిగా ఒక కోడెను, దహనబలి కోసం ఒక పొట్టేలును తేవాలి.

  21. “అహరోను తనకు, తన ఇంటివారికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఎద్దును తన పాపపరిహారబలిగా అర్పించాలి.

  22. అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక.

  23. అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి.

  24. “అహరోను పాపపరిహారబలిగా ఒక కోడెదూడను తన కోసం తన ఇంటివారి ప్రాయశ్చిత్తం కోసం తీసుకురావాలి, దానిని తన పాపపరిహారబలిగా వధించాలి.

  25. ఆ మేకపోతు తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల దుష్టత్వమంతటిని, తిరుగుబాటును, పాపాలన్నిటిని దానిపై ఒప్పుకుని వాటిని మేకపోతు తలపై మోపాలి. ఈ పనికి నియమించబడిన వ్యక్తి ఆ మేకపోతును తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టాలి.