కంటెంట్‌కు వెళ్లండి

Aaron

331 వచనాలు · 9 కుటుంబ సభ్యులు

Aaron ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “అహరోను, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘పాపపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవే: దహనబలిని వధించే స్థలంలోనే పాపపరిహారబలి పశువులను కూడా యెహోవా ఎదుట వధించాలి. అది అతిపరిశుద్ధము.

  2. ప్రతి భోజనార్పణ, ఒలీవనూనెతో కలిపినదైనా లేదా పొడిగా ఉన్నదైనా, అహరోను కుమారులందరికి సమానంగా చెందుతుంది.

  3. యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

  4. అహరోను కుమారులలో ఎవరైతే సమాధానబలి రక్తాన్ని, క్రొవ్వును అర్పిస్తాడో అతడు ఆ కుడి తొడను తన వాటాగా తీసుకోవచ్చు.

  5. ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”

  6. ఇది యెహోవాకు అర్పించిన హోమబలులలో అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా సేవ చేయడానికి సమర్పించబడిన రోజున వారికి కేటాయించబడిన వాటా.

  7. “నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రాలను, అభిషేక తైలాన్ని, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్లను గంపెడు పులియని రొట్టెలు తీసుకువచ్చి,

  8. అప్పుడు మోషే, అహరోనును, అతని కుమారులను ముందుకు తెచ్చి నీటితో వారిని కడిగాడు.

  9. అహరోనును ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంచెం అతని తలమీద పోశాడు.

  10. తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు.

  11. తర్వాత అతడు పాపపరిహారబలి కోసం ఎద్దును సమర్పించాడు, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులు ఉంచారు.

  12. తర్వాత అతడు దహనబలికి పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, దాని తలపై అహరోను అతని కుమారులు చేతులుంచారు.

  13. తర్వాత మోషే మరొక పొట్టేలును అనగా యాజకుని నియామకం కోసం కావలసిన పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, అహరోను అతని కుమారులు దాని తలమీద వారి చేతులుంచారు.

  14. మోషే పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసాడు.

  15. మోషే అహరోను కుమారులను కూడా ముందుకు పిలిచి వారి కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.

  16. అవన్నీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టగా, వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించారు.

  17. అప్పుడు మోషే కొంత అభిషేక తైలాన్ని, బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాడు. ఇలా అతడు అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను ప్రతిష్ఠించాడు.

  18. అప్పుడు మోషే అహరోనుతో, అతని కుమారులతో, “సమావేశ గుడారపు ద్వారం దగ్గర మాంసాన్ని వండి ప్రతిష్ఠార్పణల గంపలోని రొట్టెలతో తినాలి, నాకు ఆజ్ఞాపించబడిన ప్రకారం, ‘అహరోను అతని కుమారులు దానిని తినాలి.’

  19. కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు.

  20. ఎనిమిదవ రోజు మోషే అహరోనును అతని కుమారులను, ఇశ్రాయేలు గోత్ర పెద్దలను పిలిపించాడు.

  21. అతడు అహరోనుతో ఇలా అన్నాడు, “మీ పాపపరిహారబలి కోసం ఏ లోపం లేని ఒక మగ దూడను, మీ దహనబలికి ఒక లోపం లేని పొట్టేలును తీసుకువచ్చి వాటిని యెహోవా ఎదుట సమర్పించాలి.

  22. మోషే అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఆజ్ఞాపించినట్లు బలిపీఠం దగ్గరకు వచ్చి, నీ పాపపరిహారబలిని, దహనబలిని అర్పించి, నీకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి; ప్రజల కోసం అర్పణను అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”

  23. కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి సమీపించి తన పాపపరిహారబలిగా కోడెను వధించాడు.

  24. అహరోను కుమారులు దాని రక్తాన్ని అతనికి అందించారు, ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠం కొమ్ములకు రాశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోశాడు.

  25. తర్వాత అతడు దహనబలిని వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అతనికి అందించగా, అతడు దానిని బలిపీఠం చుట్టూరా చల్లాడు.