Skip to content
యోబు 40:15-24

బెహెమోతు శక్తి

యోబు 40:15-24
15
“నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.
16
దాని బలం దాని నడుములో ఉంది, దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది!
17
దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి.
18
దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి.
19
దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.
20
కొండలు దానికి ఆహారం అందిస్తాయి, అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి.
21
తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది.
22
తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి.
23
నది పొంగిపొర్లినా అది భయపడదు. యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది.
24
అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options