యోబు 15:20-35
20
దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధ అనుభవిస్తాడు. క్రూరమైనవాడు తనకు నియమించిన సంవత్సరాలన్నీ బాధ అనుభవిస్తాడు.
21
భయంకరమైన శబ్దాలు వాని చెవుల్లో మ్రోగుతాయి. అంతా క్షేమంగా ఉన్నప్పుడు నాశనం చేసేవారు అతనిపై దాడి చేస్తారు.
22
చీకటిని తప్పించుకుంటాడనే నమ్మకం అతనికి లేదు; అతడు ఖడ్గం పాలవుతాడు.
23
అతడు ఆహారం కోసం రాబందులా చుట్టూ తిరుగుతాడు; చీకటి రోజులు సమీపించాయని అతనికి తెలుసు.
24
శ్రమ వేదన అతన్ని భయపెడతాయి; యుద్ధానికి సిద్ధమైన రాజులా అవి అతన్ని ముంచెత్తుతాయి,
25
ఎందుకంటే, అతడు దేవునికి విరోధంగా చేయి చాపాడు సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల గర్వంగా ప్రవర్తించాడు.
26
అతడు మందంగా ఉన్న బలమైన డాలుతో ధిక్కారంగా దేవుని మీదికి దండెత్తుతాడు.
27
“వాని ముఖం క్రొవ్వుపట్టి ఉన్నప్పటికీ అతని నడుము క్రొవ్వుతో ఉబ్బినప్పటికి,
28
అతడు పాడైపోయిన పట్టణాల్లో ఎవరు నివసించని ఇళ్ళలో, శిధిలమైపోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.
29
ఇక ఎప్పటికీ అతడు ధనవంతునిగా ఉండడు అతని సంపద నిలబడదు. అతని ఆస్తులు భూమిలో విస్తరించవు.
30
అతడు చీకటిని తప్పించుకోలేడు అతని లేత మొక్కలను అగ్ని కాల్చివేస్తుంది, దేవుని నోటి ఊపిరిచేత అతడు చనిపోతాడు.
31
అతడు వ్యర్థమైన దానిని నమ్మి తనను తాను మోసగించుకోవద్దు ఎందుకంటే అతనికి ప్రతిఫలం ఏమి ఉండదు.
32
అతని కాలం పూర్తి కాక ముందే వాడిపోతాడు, అతని కొమ్మలు వృద్ధిచెందవు.
33
పిందెలు రాలిపోయే ద్రాక్ష చెట్టులా, పువ్వులు రాలిపోయే ఒలీవ చెట్టులా అతడు ఉంటాడు.
34
భక్తిలేనివారి సహచరులు నిస్సారంగా ఉంటారు, లంచాలు ప్రేమించేవారి గుడారాలను అగ్ని కాల్చివేస్తుంది.
35
వారు దుష్టత్వాన్ని గర్భం ధరించి చెడును కంటారు. వారి కడుపున మోసం పుడుతుంది.”
Settings