Skip to content
యోబు 16:1-5

యోబు 16:1-5

1
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2
నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను; మీరందరు నీచంగా ఓదార్చేవారు.
3
మీ గాలిమాటలకు అంతం లేదా? మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?
4
నేనున్న స్థానంలో మీరు ఉంటే, నేనూ మీలాగే మాట్లాడగలను; మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.
5
కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది; నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options