Skip to content
యోబు 16:6-16

యోబు 16:6-16

6
అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు; మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.
7
దేవా, నాకు అలసట కలిగించారు; నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.
8
మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది; బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.
9
దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు; ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు; నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.
10
ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు; నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు. నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు.
11
దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.
12
నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు; నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు. ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;
13
ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.
14
పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు; శూరునిలా పరుగున నా మీద పడ్డారు.
15
నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను నా నుదిటిని దుమ్ములో ఉంచాను.
16
ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కింది నా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options