యోబు 15:7-16
7
“నీవేమైన మొదట పుట్టిన పురుషునివా? కొండలు ఏర్పడక ముందే నీవు ఉన్నావా?
8
దేవుని ఆలోచనసభలో నీవు ఉన్నావా? జ్ఞానం నీకొక్కడికే సొంతమా?
9
నీకు తెలిసినది మాకు తెలియనిది ఏమిటి? నీవు గ్రహించగలిగింది మేము గ్రహించలేనిది ఏమిటి?
10
తల నెరసినవారు వృద్ధులైనవారు మా వైపు ఉన్నారు, వారు వయస్సులో నీ తండ్రి కంటే పెద్దవారు.
11
దేవుని ఓదార్పులు నీకు సరిపోవడం లేదా? ఆయన మృదువైన మాటలు సరిపోవడం లేదా?
12
దేవుని మీద కోప్పడి, ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చేలా, నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది నీ కళ్లు ఎందుకు ఎర్రబడ్డాయి?
14
“పవిత్రులుగా ఉండడానికి మనుష్యులు ఏపాటివారు? నీతిమంతులుగా ఉండడానికి స్త్రీకి పుట్టిన వారు ఏపాటివారు?
15
దేవుడు తన పవిత్రులను కూడా నమ్మకపోతే, ఆయన దృష్టిలో ఆకాశాలు కూడా పవిత్రం కాకపోతే,
16
ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు, ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు!
Settings