యోబు 15:1-6
1
అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
2
“జ్ఞానం కలవారు వ్యర్థమైన తెలివితో సమాధానం ఇస్తారా? తూర్పు గాలితో తమ కడుపు నింపుకొంటారా?
3
పనికిరాని పదాలతో విలువలేని మాటలతో వారు వాదిస్తారా?
4
నీవు భక్తిని విడిచిపెట్టి దేవుని గురించిన ధ్యానాన్ని అడ్డగిస్తున్నావు.
5
నీ నోరు నీ పాపాలను తెలియజేస్తుంది; కపటంగా మాట్లాడేవారిలా నీవు మాట్లాడుతున్నావు.
6
నేను కాదు, నీ నోరే నిన్ను ఖండిస్తుంది; నీ పెదవులే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాయి.
Settings