Skip to content
యెహెజ్కేలు 48:8-14

యెహెజ్కేలు 48:8-14

8
“తూర్పు నుండి పడమర వరకు యూదా భూభాగానికి సరిహద్దుగా ఉండే భాగాన్ని మీరు ప్రత్యేక బహుమతిగా సమర్పించాలి. అది 25,000 మూరల వెడల్పు, దాని పొడవు తూర్పు నుండి పడమర వరకు ఉన్న గోత్రాల భాగాలలో ఒక దానితో సమానము.
9
“యెహోవాకు ప్రతిష్ఠించే ప్రత్యేక భాగం పొడవు 25,000 మూరలు. వెడల్పు 10,000 మూరలు ఉంటుంది.
10
ఇది యాజకులకు కేటాయించబడిన పవిత్రమైన భాగము. అది ఉత్తరం వైపు 25,000 మూరల పొడవు, పడమర వైపు 10,000 మూరల వెడల్పు, తూర్పు వైపున 10,000 మూరల వెడల్పు దక్షిణం వైపున 25,000 మూరల పొడవు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా మందిరం ఉంటుంది.
11
ఇది ప్రతిష్ఠించబడిన యాజకులైన సాదోకు సంతతివారి కోసము. ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టినప్పుడు లేవీయుల్లా తప్పుదారి పట్టకుండా, వారు నాకు సేవచేయడంలో నమ్మకంగా ఉన్నారు.
12
పవిత్రమైన భూమిలో లేవీయుల భూభాగానికి సరిహద్దుగా ఉన్న ఆ భాగం వారికి ప్రత్యేక బహుమతిగా ఉంటుంది, అది అతిపరిశుద్ధమైన భాగము.
13
“యాజకుల ప్రాంతంతో పాటు, లేవీయులకు 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు ఉంటుంది. దాని మొత్తం పొడవు 25,000 మూరలు వెడల్పు 10,000 మూరలు.
14
వారు దేనినీ అమ్మకూడదు లేదా మార్చుకోకూడదు. ఇది భూమిలో శ్రేష్ఠమైనది ఇతర చేతుల్లోకి వెళ్లకూడదు, ఎందుకంటే ఇది యెహోవాకు పవిత్రమైనది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options