Skip to content
యెహెజ్కేలు 48:23-29

యెహెజ్కేలు 48:23-29

23
“తక్కిన గోత్రాల వివరాలు: “బెన్యామీను వారికి ఒక భాగము. అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.
24
షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది.
25
ఇశ్శాఖారు వారికి ఒక వాటా! అది తూర్పు నుండి పడమర వరకు షిమ్యోను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
26
జెబూలూను తూర్పు నుండి పడమర వరకు ఇశ్శాఖారు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
27
గాదు వారికి ఒక వాటా. అది తూర్పు నుండి పడమర వరకు జెబూలూను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
28
గాదు దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళ్తుంది.
29
“ఇశ్రాయేలు గోత్రాలకు వారసత్వంగా కేటాయించవలసిన దేశం ఇదే, ఇవి వారి భాగాలు” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options