యెహెజ్కేలు 48:1-7
1
“పేర్ల ప్రకారం జాబితా తయారుచేయబడిన గోత్రాలు ఇవే: “ఉత్తర సరిహద్దులో దానుకు ఒక భాగం ఉంటుంది; అది హెత్లోను నుండి లెబో హమాతుకు వెళ్లే రహదారి వెంట ఉంటుంది; హజర్-ఎనాను హమాతుకు ప్రక్కన దమస్కు ఉత్తర సరిహద్దు తూర్పు వైపు నుండి పడమటి వైపు వరకు దాని సరిహద్దులో భాగంగా ఉంటుంది.
2
ఆషేరు వారికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమటి వరకు దానుకు సరిహద్దుగా ఉంటుంది.
3
నఫ్తాలికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఆషేరు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
4
మనష్షేకు ఒక భాగం ఉంటుంది; అది తూర్పు నుండి పడమర వరకు నఫ్తాలి భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
5
ఎఫ్రాయిముకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు మనష్షే భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
6
రూబేనుకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఎఫ్రాయిముకు సరిహద్దుగా ఉంటుంది.
7
యూదాకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు రూబేను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
Settings