Skip to content
1 దినవృత్తాంతములు 8:6-27

బెన్యామీను భూభాగములో నివసించిన కుటుంబాలు

1 దినవృత్తాంతములు 8:6-27
6
వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది:
7
నయమాను, అహీయా, గెరా అనేవారు, వారిని మనహతుకు బందీలుగా తీసుకెళ్లారు. గెరా, ఉజ్జా, అహీహూదుల తండ్రి.
8
షహరయీము తన భార్యలైన హుషీము, బయారాలను విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి మోయాబు దేశంలో కుమారులు పుట్టారు.
9
తన భార్యయైన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
10
యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. అతని కుమారులైన వీరు తమ కుటుంబాలకు పెద్దలు.
11
హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు.
12
ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు),
13
బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.
14
అహ్యో, షాషకు, యెరేమోతు,
15
జెబద్యా, అరాదు, ఏదెరు,
16
మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు బెరీయా కుమారులు.
17
జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
18
ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు ఎల్పయలు కుమారులు.
19
యాకీము, జిఖ్రీ, జబ్ది,
20
ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
21
అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు షిమీ కుమారులు.
22
ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
23
అబ్దోను, జిఖ్రీ, హానాను,
24
హనన్యా, ఏలాము, అంతోతీయా,
25
ఇఫెదయా, పెనూయేలు అనేవారు షాషకు కుమారులు.
26
షంషెరై, షెహర్యా, అతల్యా,
27
యయరెష్యా, ఏలీయా, జిఖ్రీ అనేవారు యెరోహాము కుమారులు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.