1 దినవృత్తాంతములు 8:28-32
28
వీరందరు తమ వంశావళి ప్రకారం కుటుంబాలకు పెద్దలు, ప్రముఖులు; వీరు యెరూషలేములో నివసించారు.
29
గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.
30
అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
31
గెదోరు, అహ్యో, జెకెరు,
32
షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
Settings