Skip to content
1 దినవృత్తాంతములు 6:39-66

1 దినవృత్తాంతములు 6:39-66

39
హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి: ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు,
40
అతడు మిఖాయేలు కుమారుడు, అతడు బయశేయా కుమారుడు, అతడు మల్కీయా కుమారుడు,
41
అతడు యెత్నీ కుమారుడు, అతడు జెరహు కుమారుడు, అతడు అదాయా కుమారుడు,
42
అతడు ఏతాను కుమారుడు, అతడు జిమ్మా కుమారుడు, అతడు షిమీ కుమారుడు,
43
అతడు యహతు కుమారుడు, అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;
44
హేమాను ఎడమ ప్రక్కన మెరారీయులు సేవ చేశారు: ఏతాను కీషీ కుమారుడు, అతడు అబ్దీ కుమారుడు, అతడు మల్లూకు కుమారుడు,
45
అతడు హషబ్యా కుమారుడు, అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,
46
అతడు అమ్జీ కుమారుడు, అతడు బానీ కుమారుడు, అతడు షమెరు కుమారుడు,
47
అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు.
48
వారి తోటి లేవీయులు దేవుని మందిరమనే ప్రత్యక్షగుడారంలో జరగాల్సిన ఇతర పనులన్నిటి కోసం నియమించబడ్డారు.
49
అయితే అహరోను అతని సంతానం దహనబలిపీఠం మీద ధూపవేదిక మీద అర్పణలు అర్పించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో చేయవలసిన వాటన్నిటిని చేయడానికి, దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన ప్రకారం ఇశ్రాయేలు కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నియమించబడ్డారు.
50
వీరు అహరోను సంతానం: అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు, అతని కుమారుడు అబీషూవ,
51
అతని కుమారుడు బుక్కీ, అతని కుమారుడు ఉజ్జీ, అతని కుమారుడు జెరహ్యా,
52
అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా, అతని కుమారుడు అహీటూబు,
53
అతని కుమారుడు సాదోకు, అతని కుమారుడు అహిమయస్సు.
54
అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి:
55
యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు.
56
(అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.)
57
అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా,
58
హీలేను, దెబీరు,
59
ఆషాను, యుత్తా, బేత్-షెమెషు, వాటి దాని పచ్చిక మైదానాలతో ఇవ్వబడ్డాయి.
60
బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.
61
కహాతు సంతానంలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్ర వంశస్థుల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు కేటాయించబడ్డాయి.
62
గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి.
63
మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి.
64
ఈ విధంగా ఇశ్రాయేలీయులు, లేవీయులకు ఈ పట్టణాలను వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు.
65
యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి.
66
కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిం గోత్ర ప్రదేశాల నుండి సరిహద్దు పట్టణాలు ఇవ్వబడ్డాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options