Skip to content
1 దినవృత్తాంతములు 6:31-48

1 దినవృత్తాంతములు 6:31-48

31
నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.
32
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.
33
తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు: కహాతీయుల నుండి: సంగీతకారుడైన హేమాను, హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,
34
అతడు ఎల్కానా కుమారుడు, అతడు యెరోహాము కుమారుడు, అతడు ఎలీయేలు కుమారుడు, అతడు తోయహు కుమారుడు,
35
అతడు సూఫు కుమారుడు, అతడు ఎల్కానా కుమారుడు, అతడు మహతు కుమారుడు అతడు అమాశై కుమారుడు,
36
అతడు ఎల్కానా కుమారుడు, అతడు యోవేలు కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు జెఫన్యా కుమారుడు,
37
అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు, అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,
38
అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;
39
హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి: ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు,
40
అతడు మిఖాయేలు కుమారుడు, అతడు బయశేయా కుమారుడు, అతడు మల్కీయా కుమారుడు,
41
అతడు యెత్నీ కుమారుడు, అతడు జెరహు కుమారుడు, అతడు అదాయా కుమారుడు,
42
అతడు ఏతాను కుమారుడు, అతడు జిమ్మా కుమారుడు, అతడు షిమీ కుమారుడు,
43
అతడు యహతు కుమారుడు, అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;
44
హేమాను ఎడమ ప్రక్కన మెరారీయులు సేవ చేశారు: ఏతాను కీషీ కుమారుడు, అతడు అబ్దీ కుమారుడు, అతడు మల్లూకు కుమారుడు,
45
అతడు హషబ్యా కుమారుడు, అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,
46
అతడు అమ్జీ కుమారుడు, అతడు బానీ కుమారుడు, అతడు షమెరు కుమారుడు,
47
అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు.
48
వారి తోటి లేవీయులు దేవుని మందిరమనే ప్రత్యక్షగుడారంలో జరగాల్సిన ఇతర పనులన్నిటి కోసం నియమించబడ్డారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options