- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
నెహెమ్యా7
Listen to this chapter
0:00
0:00
పరిపాలన మరియు భద్రత ఏర్పాటు
1
నేను గోడ కట్టిన తర్వాత తలుపులు నిలబెట్టి, ద్వారపాలకులను సంగీతకారులను, లేవీయులను నియమించాను.
2
నా సోదరుడైన హనానీతో పాటు కోటకు అధిపతియైన హనన్యాను యెరూషలేముపై అధికారులుగా నియమించాను. హనన్యా నమ్మకమైనవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని భయం ఉన్నవాడు.
3
నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను.
4
అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు.
మొదట తిరిగి వచ్చినవారి నమోదు నెహెమ్యాకు దొరకుట
5
కుటుంబాల ప్రకారం నమోదు చేయాలనే ఆలోచన దేవుడు నాకు పుట్టించగా నేను సంస్థానాధిపతులను అధికారులను ప్రజలను సమకూర్చాను. అంతలో ముందు వచ్చినవారి కుటుంబ వివరాలు ఉన్న ఒక గ్రంథం నాకు దొరికింది. దానిలో ఉన్న వివరాలు:
తిరిగి వచ్చినవారి నమోదు
6
బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,
7
జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు:
8
పరోషు వారసులు 2,172;
9
షెఫట్యా వారసులు 372;
10
ఆరహు వారసులు 652;
11
పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,818;
12
ఏలాము వారసులు 1,254;
13
జత్తూ వారసులు 845;
14
జక్కయి వారసులు 760;
15
బిన్నూయి వారసులు 648;
16
బేబై వారసులు 628;
17
అజ్గాదు వారసులు 2,322;
18
అదోనీకాము వారసులు 667;
19
బిగ్వయి వారసులు 2,067;
20
ఆదీను వారసులు 655;
21
అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;
22
హాషుము వారసులు 328;
23
బేజయి వారసులు 324;
24
హారీపు వారసులు 112;
25
గిబియోను వారసులు 95.
26
బేత్లెహేము వారసులు: నెటోపా వారసులు 188;
27
అనాతోతు వారసులు 128;
28
బేత్-అజ్మావెతు వారసులు 42;
29
కిర్యత్-యారీము, కెఫీరా బెయేరోతు వారసులు 743;
30
రామా, గెబా వారసులు 621;
31
మిక్మషు వారసులు 122;
32
బేతేలు, హాయి వారసులు 123;
33
రెండవ నెబో వారసులు 52;
34
మరొక ఏలాము వారసులు 1,254;
35
హారీము వారసులు 320;
36
యెరికో వారసులు 345;
37
లోదు, హదీదు, ఓనో వారసులు 721;
38
సెనాయా వారసులు 3,930.
యాజకులు, లేవీయులు మరియు మందిర సేవకులు
39
యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973;
40
ఇమ్మేరు వారసులు 1,052;
41
పషూరు వారసులు 1,247;
42
హారీము వారసులు 1,017.
43
లేవీయులు: యెషూవ వారసులు (హోదవ్యా కుటుంబం, కద్మీయేలు కుటుంబం నుండి) 74.
44
సంగీతకారులు: ఆసాపు వారసులు 148.
45
ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138.
46
ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,
47
కేరోసు, సీయహా, పాదోను వారసులు,
48
లెబానా, హగాబా, షల్మయి వారసులు,
49
హానాను, గిద్దేలు, గహరు వారసులు,
50
రెవాయా, రెజీను, నెకోదా వారసులు,
51
గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు,
52
బేసాయి, మెహూనీము, నెఫూసీము వారసులు,
53
బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,
54
బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,
55
బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
56
నెజీయహు, హటీపా వారసులు.
57
సొలొమోను సేవకుల వారసులు: సొటయి, సోఫెరెతు, పెరీదా వారసులు
58
యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,
59
షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు.
60
ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.
వంశపారంపర్యం వివాదాస్పదమైనవారు
61
తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు, అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:
62
దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642.
63
యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు) వారసులు.
64
వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.
65
కాబట్టి ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.
జనాభా మరియు సంపద సంగ్రహం
66
సమూహం మొత్తం సంఖ్య 42,360,
67
వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 245 మంది.
68
వారి గుర్రాలు 736, కంచరగాడిదలు 245,
69
ఒంటెలు 435, గాడిదలు 6,720.
70
కుటుంబ పెద్దలలో కొందరు పనికి సహాయపడ్డారు. అధిపతి ఖజానాకు 1,000 డారిక్కుల బంగారం, 50 పళ్లాలు, 530 యాజక వస్త్రాలు ఇచ్చాడు.
71
కుటుంబ పెద్దలలో కొంతమంది పని కోసం ఖజానాకు 20,000 డారిక్కుల బంగారం, 2,200 మీనాల వెండి ఇచ్చారు.
72
మిగిలినవారంతా కలిసి 20,000 డారిక్కుల బంగారం 2,000 మీనాల వెండి, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు.
పట్టణాలలో నివాసం ఏర్పరచుకొనుట
73
యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు, కొంతమంది ప్రజలతో పాటు మిగిలిన ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులంతా ఏడవ నెల రాగానే తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు,
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note