యెహోషువ16
Listen to this chapter
0:00
0:00
1
యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం తూర్పున ఉన్న యెరికో నీటి ఊటల దగ్గర యొర్దాను నుండి మొదలై ఎడారి గుండా బేతేలు కొండసీమ లోపలి వరకు ఉంది.
2
అది లూజు అనబడే బేతేలు వరకు వెళ్లి అతారోతులో ఉన్న అర్కీయుల భూభాగం దాటి,
3
దిగువ బేత్-హోరోను ప్రాంతం వరకు పడమటివైపుగా యఫ్లెతీయుల భూభాగం వరకు, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసే గెజెరు వరకు దిగారు.
4
అక్కడ యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిం వారి వారసత్వాన్ని పొందారు.
5
ఎఫ్రాయిమీయుల వంశాల ప్రకారం వారి సరిహద్దు ఈ విధంగా: వారి వారసత్వపు సరిహద్దు తూర్పున అతారోత్-అద్దారు నుండి ఎగువ బేత్-హోరోను వరకు వెళ్లి,
6
మధ్యధరా సముద్రం వరకు కొనసాగింది. దానికి ఉత్తరాన ఉన్న మిక్మెతాతు నుండి అది తూర్పున తానత్ షిలోహు వరకు తిరిగి, తూర్పున ఉన్న యానోహ వరకు వెళ్లింది.
7
అది యానోహ నుండి అతారోతు, నయరా వైపుకు దిగి, యెరికోను తాకి, యొర్దాను దగ్గర అంతమయ్యింది.
8
తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము.
9
మనష్షే వారి వారసత్వంలో ఎఫ్రాయిమీయుల కోసం కేటాయించబడిన అన్ని పట్టణాలు, వాటి గ్రామాలు కూడా ఉన్నాయి.
10
గెజెరులో నివసిస్తున్న కనానీయులను వారు వెళ్లగొట్టలేదు; ఈ రోజు వరకు కనానీయులు ఎఫ్రాయిం ప్రజలమధ్య నివసిస్తూ దాసులుగా కష్టపడి పని చేస్తున్నారు.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note