కంటెంట్‌కు వెళ్లండి

Zeruiah గురించి బైబిల్ వచనాలు: Mother of three of David's great soldiers

7 వచనాలు · 2 కోణాలు

Mother of three of David's great soldiers గురించి వచనాలు

  1. సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.

  2. నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.

  3. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “ఈ చచ్చిన కుక్క రాజైన నా ప్రభువును ఎందుకు శపించాలి? నేను వెళ్లి అతని తల నరికివేయనివ్వండి” అన్నాడు.

  4. అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.

  5. తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి.

  6. అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు. అతని తల్లి అబీగయీలు యోవాబు తల్లియైన సెరూయాకు సోదరియైన నాహాషు కుమార్తె.

  7. సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.