Skip to content

Wool గురించి బైబిల్ వచనాలు

14 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,

  2. నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,

  3. ఒకవేళ వస్త్రాల్లో గాని, చర్మంలో గాని, నేసిన దుస్తుల్లో గాని లేదా అల్లిన దుస్తుల్లో గాని, లేదా ఏదైనా చర్మంతో చేయబడిన వస్తువు మీద గాని పాడైన చోట పచ్చగా లేదా ఎరుపుగా ఉంటే, అది కుష్ఠు మరక యొక్క లక్షణం కాబట్టి తప్పక యాజకునికి చూపించాలి.

  4. యాజకుడు ఆ పాడైన చోటును పరీక్షించి ఏడు రోజులు ఆ వస్తువును వేరుగా ఉంచాలి.

  5. ఏడవ రోజు అతడు దానిని పరీక్షించాలి, ఒకవేళ వస్త్రంలో గాని, నేసిన దానిలో గాని లేదా అల్లిన దానిలో గాని, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసినవైనా దానిలో గాని వ్యాపిస్తే, దాని ఉపయోగం ఏదైనా, అది తీవ్రమైన కుష్ఠు మరక; ఆ వస్తువు అపవిత్రము.

  6. పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.

  7. ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.

  8. “ ‘నా శాసనాలు పాటించాలి. “ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు. “ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు. “ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు.

  9. మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి.

  10. ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు.

  11. చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు.

  12. ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.

  13. మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు.

  14. “ ‘వారు లోపలి ఆవరణపు గుమ్మాల్లోకి ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరించాలి; లోపలి ఆవరణపు గుమ్మాల్లో గాని మందిరం లోపల గాని సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు వేసుకోకూడదు.