Trumpet గురించి బైబిల్ వచనాలు: Blowing at all religious processions and ceremonies
Blowing at all religious processions and ceremonies గురించి వచనాలు
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.
ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో పొట్టేళ్ల కొమ్ము బూరల ధ్వనితో, తాళాలు వీణలు సితారలు వాయిస్తూ, యెహోవా నిబంధన మందసాన్ని తీసుకువచ్చారు.
బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి: “యెహోవా మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని పాడారు. అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది.
వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ బూరలు, కొమ్ములు ఊదుతూ, యెహోవా సమక్షంలో ప్రమాణం చేశారు.