Skip to content

Tithe గురించి బైబిల్ వచనాలు

46 వచనాలు · 20 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. And the Levite, (because he hath no part nor inheritance with thee,) and the stranger, and the fatherless, and the widow, which are within thy gates, shall come, and shall eat and be satisfied; that the LORD thy God may bless thee in all the work of thine hand which thou doest.

  2. పదవ భాగం ఇచ్చే సంవత్సరం, అనగా మూడవ సంవత్సరం మీ రాబడిలో దశమభాగం చెల్లించి, అది లేవీయులకు విదేశీయులకు తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇవ్వాలి. వారు మీ గ్రామాల్లో వీరంతా తిని తృప్తి పొందాలి.

  3. అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఇలా చెప్పాలి: “మీరు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రతిష్ఠితమైన దాన్ని నా ఇంటి నుండి తీసివేసి లేవీయులకు విదేశీయులకు, తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇచ్చాను. నేను మీ ఆజ్ఞలను ప్రక్కన పెట్టలేదు వాటిలో దేన్ని నేను మరచిపోలేదు.

  4. నేను దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన దానిలోనిది ఏదీ తినలేదు, నేను అపవిత్రంగా ఉన్న సమయంలో అందులో ఏదీ తీసివేయలేదు, చనిపోయినవారి కోసం దాన్ని అర్పించలేదు.నేను నా దేవుడైన యెహోవాకు లోబడ్డాను; మీరు ఆజ్ఞాపించిన ప్రతిదీ నేను చేశాను.

  5. మీ పవిత్ర నివాసమైన ఆకాశం నుండి క్రిందికి చూడండి మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను, మీరు మాకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిని ఆశీర్వదించండి.”

  6. కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము.

  7. మీ ధాన్యంలో ద్రాక్షపండ్లలో పదవ భాగాన్ని తీసుకుని తన అధికారులకు సహాయకులకు ఇస్తాడు.

  8. మీ గొర్రెల మందలలో పదవ భాగాన్ని తీసుకుంటాడు, అంతేకాదు స్వయంగా మీరే అతనికి బానిసలవుతారు.

  9. అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.

  10. యూదా పట్టణాల్లో కాపురం ఉంటున్న యూదా వారు, ఇశ్రాయేలీయులు తమ పశువుల మందలో నుండి, గొర్రెల, మేకలమందలలో నుండి పదవ భాగాన్ని తెచ్చారు. తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులలో నుండి కూడా పదవ భాగాన్ని తెచ్చారు. వాటిని కుప్పలుగా పేర్చారు.

  11. ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు.

  12. “అంతే కాకుండా, మా పిండిలో, భోజన అర్పణలలో, అన్ని రకాల మా పండ్లచెట్ల ఫలాల్లో, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో అన్నిటిలో ప్రథమ ఫలాన్ని మన దేవుని మందిరపు గిడ్డంగులకు యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. పదవ భాగాన్ని లేవీయుల దగ్గరకి తీసుకురావాలని, మేము పని చేసే అన్ని పట్టణాల్లో పదవ భాగాన్ని సేకరించి లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించాము.

  13. లేవీయులు పదవ భాగాన్ని తీసుకునేటప్పుడు వారితో పాటు అహరోను వారసుడైన ఒక యాజకుడు ఉండాలని, లేవీయులు ఆ పదవ భాగాలన్నిటిలో పదవ భాగాన్ని మన దేవుని ఆలయ గిడ్డంగులకు ఖజానాకు తీసుకురావాలి.

  14. లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను.

  15. కాబట్టి నేను అధికారులను గద్దించి, “దేవుని మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు?” అని అడిగాను. తర్వాత నేను వారందరిని ఒక్క దగ్గరికి పిలిచి వారిని వారి స్థానాల్లో మరలా నియమించాను.

  16. యూదా ప్రజలందరు ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో పదవ వంతులను గిడ్డంగులకు తెచ్చారు.

  17. యాజకుడైన షెలెమ్యా, శాస్త్రియైన సాదోకు, లేవీయుడైన పెదాయాలను గిడ్డంగుల మీద అధికారులుగా నియమించాను. అలాగే వారికి సహాయంగా జక్కూరు కుమారుడును, మత్తన్యా మనుమడునైన హానానును నియమించాను ఎందుకంటే వీరంతా నమ్మకస్థులుగా పేరు పొందారు. తమ తోటి లేవీయులకు ఆహారం పంచి ఇవ్వాల్సిన బాధ్యత అప్పగించబడింది.

  18. “మానవులు దేవున్ని దోచుకుంటారా? కాని మీరు నన్ను దోచుకుంటున్నారు. “అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా దోచుకుంటున్నాము?’ అని అడుగుతారు. “పదవ భాగాన్ని కానుకలను ఇవ్వక దోచుకుంటున్నారు.

  19. “పరిసయ్యులారా, మీకు శ్రమ. ఎందుకంటే, మీరు పుదీనా, మెంతులు ఇంకా అన్ని రకాల ఆకుకూరల్లో దేవునికి పదవ భాగం ఇస్తున్నారు, కాని న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మొదటివాటిని విడిచిపెట్టకుండా వెనుకటివాటిని పాటించాల్సింది.

  20. నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’

  21. ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు.