Tithe గురించి బైబిల్ వచనాలు: Reasonableness of appointing, for the Levites
Reasonableness of appointing, for the Levites గురించి వచనాలు
యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని.
లేవీయులు మాత్రమే సమావేశ గుడారంలో సేవ చేస్తారు వారు చేసే అపరాధాలకు వారే బాధ్యులు. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.
దానికి బదులు, ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించే దశమ భాగాలను నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ఇస్తున్నాను. అందుకే, వారిని ఉద్దేశించి ఇలా చెప్పాను: ‘ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.’ ”
కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము.