Skip to content

The Stars గురించి బైబిల్ వచనాలు

57 వచనాలు · 40 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి.

  2. దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు.

  3. భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు.

  4. దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు.

  5. “అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.

  6. మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.

  7. ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ,

  8. నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,

  9. ఆ విషయం మీ దృష్టికి తీసుకురాబడితే, మీరు దానిని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఒకవేళ అది నిజమై, ఆ అసహ్యకరమైన విషయం ఇశ్రాయేలులో జరిగిందని నిరూపించబడితే,

  10. ఆ దుర్మార్గం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మీ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి వారిని రాళ్లతో కొట్టి చంపాలి.

  11. ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల వాంగ్మూలం మీదనే ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలి, కానీ ఒక్క సాక్షి వాంగ్మూలంపై ఎవరికి మరణశిక్ష విధించకూడదు.

  12. ఆ వ్యక్తికి మరణశిక్ష విధించడంలో మొదట సాక్షుల చేతులు, తర్వాత ప్రజలందరి చేతులు ఉండాలి. మీరు మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.

  13. నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి, తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.

  14. అంతకుముందు యూదా పట్టణాల్లో, యెరూషలేము చుట్టూ క్షేత్రాల్లో ధూపం వేయడానికి యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని అతడు తొలగించాడు. వారు బయలుకు, సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర సమూహాలన్నిటికి వేసేవారు.

  15. ఆ విధంగా మేము పని చేశాము; మాలో సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.

  16. దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక; వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి, ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు.

  17. ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.

  18. స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు.

  19. ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.

  20. When the morning stars sang together, and all the sons of God shouted for joy?

  21. “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?

  22. నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా?

  23. మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,

  24. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  25. ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.